ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో కార్మికుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఆటో డ్రైవర్ల ఫైనాన్స్ లలో బ్యాంకు రుణాలలో తెచ్చుకొని ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని

 Protest Of Auto Workers In Yellareddypeta Mandal, Protest ,auto Workers ,yellare-TeluguStop.com

ఈ పథకం ద్వారా ఆటోలకు గిరాకీలు లేక ఫైనాన్స్లో రుణాలు కట్టడానికి డబ్బు లేక ఆర్థికంగా కుంగిపోతున్నామని అన్నారు.

ఈ పథకం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్ల పరిస్థితి దుర్భరంగా మారను ఉన్నాయని అన్నారు వెంటనే ఈ పథకాన్ని నిలిపివేయాలని ఎల్లారెడ్డిపేట మండల ఆటో యూనియన్ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube