సాధారణంగా చెప్పాలంటే చాలా మంది ప్రజలు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించిన వారి చేతిలో నిలవకుండా ఖర్చయిపోతూ ఉంటుంది.అలాగే చాలామంది ప్రజలకు అదనపు ఖర్చులు పెరిగి అప్పులు కూడా చేయవలసి వస్తుంది.
అటువంటి సమయంలో చాలామంది ఏం చేయాలో తెలియక అప్పుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు.అయితే జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని రకాల సమస్యలకు వాస్తు కూడా కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యలకు,( Financial problems )అలాగే మానసిక సమస్యలకు కూడా వాస్తు కారణంగా కావచ్చు.

అటువంటి సమయంలో కొన్ని రకాల పరిహారాలు పాటించడంతో పాటు కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇంట్లో వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి.ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు సూర్యాస్తమయం సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఖచ్చితంగా ధనవంతులు అవుతారు.
మరి సూర్యాస్తమయంలో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.లక్ష్మీదేవి( Goddess Lakshmi ) అనుగ్రహం కోసం చాలా మంది అనేక రకాల నియమాలు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు.
అయితే హిందూ ధర్మంలో సాయంత్రం సమయంలో చేసే శుభకార్యాలు లక్ష్మీ అనుగ్రహానికి కారణమవుతాయని పండితులు చెబుతున్నారు.

సూర్యోదయ, సూర్యాస్తమయలలో తప్పకుండా సూర్య నమస్కారం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.సాయంత్రం సమయంలో చేసే పూజకు ఎంతో మహత్తు ఉంటుందని పండితులు చెబుతున్నారు.
సూర్యాస్తమయం లో ఇంట్లోని పూజ మందిరంలో తులసి ముందు దీపం( Tulasi ) వెలిగించాలి.అలాగే సాయం కాలం ఇంట్లో దీపం వెలిగించి వెలుగును ఇంట్లోకి ఆహ్వానించాలి.
ఇంట్లోకి చీకటి ప్రవేశించకుండా జాగ్రత్తపడాలి.చీకటి నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతుంది.
అలాగే మనశ్శాంతిని కూడా దూరం చేస్తుందని పండితులు చెబుతున్నారు.అలాగే ఆర్థిక నష్టాలను కూడా కలిగిస్తుంది.
సూర్యాస్తమయం లో పితృదేవతలను తలుచుకొని వారి ఆశీస్సుల కోసం వేడుకోవాలి.ఇలా చేయడం వల్ల వంశంలోని పూర్వీకుల దీవెనల వల్ల జీవితంలో దురదృష్టం దూరమవుతుంది.
సాయంత్రం సమయంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల అదృష్టం ఎప్పుడు మీ వెంటే ఉంటుందని పండితులు చెబుతున్నారు.