తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు అతికొద్ది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారంలో వేగం పెంచింది.ఇప్పటికే పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు తాజాగా ఇవాళ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.రెండు రోజులపాటు రాష్ట్రంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
పాలకుర్తి, హుస్నాబాద్ తో పాటు కొత్తగూడెంలో పర్యటించనున్న ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించనున్నారు.ఈ మేరకు మరికాసేపటిలో ఆమె పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్లనున్నారు.అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినికి మద్ధతుగా ఎన్నికల ప్రచారం చేయనున్న ప్రియాంక గాంధీ మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్నాబాద్ లో అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు మద్ధతుగా ఎన్నికల ప్రచారం చేస్తారు.సాయంత్రం కొత్తగూడెంలో మిత్రపక్షానికి మద్ధతుగా క్యాంపెయిన్ లో పాల్గొననున్న ప్రియాంక గాంధీ రాత్రికి ఖమ్మంలో బస చేయనున్నారు.అనంతరం రేపు ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిరలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.