రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా( Ranbir Kapoor ) కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఈ ట్రైలర్ ఉంది.
యానిమల్ ట్రైలర్ హిందీ వెర్షన్ కు 48 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.యానిమల్ తెలుగు ట్రైలర్ కు మాత్రం కేవలం 6.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.అయితే ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కావడం గమనార్హం.
గతంలో వేర్వేరు కారణాల వల్ల పుష్ప సినిమాను వదులుకున్న మహేష్ బాబు యానిమల్ సినిమాను సైతం వదులుకున్నారని తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.యానిమల్ మూవీలో మహేష్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది చెబుతుండగా మహేష్ బాబుకు ఇలాంటి సినిమాలు సూట్ కావని ఆయన కూడా అదే ఫీలై ఈ సినిమాకు నో చెప్పారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.అయితే మహేష్ రాజమౌళి సినిమాలో నటించనున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఆకలి తీరుతుందని అభిమానులు ఫీలవుతున్నారు.భవిష్యత్తులో మహేష్ సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga )కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.మరోవైపు మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తున్నాయి.
అటు మహేష్( Mahesh babu ) ఇటు జక్కన్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.మహేష్ జక్కన్న ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకోవడంతో పాటు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.