Jagapathi Babu: జీవితంలో జగపతిబాబు తాతయ్య కాలేరా… ఆ కోరిక అలాగే మిగిలిపోనుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు జగపతిబాబు (Jagapathi Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగినటువంటి జగపతిబాబు ఎన్నో కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు.

 Latest News About Actor Jagapathi Babu-TeluguStop.com

ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి జగపతిబాబుకి క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.ఇలా ఈయనకు హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.

ఇక జగపతిబాబు కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ (Legend) సినిమాలో విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ఈయన నటన అద్భుతమని చెప్పాలి.ఇలా విలన్ గా ( Villain ) ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి జగపతిబాబు కు అప్పటినుంచి విలన్ పాత్రలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం కెరియర్ పరంగా జగపతిబాబు ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి.

ఈయన పలు సందర్భాలలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ సినిమా అవకాశాలు లేకపోవడంతో నా దగ్గర రెండు ఫోన్లు ఉండేవి ఆ ఫోన్లో చూస్తూ కూర్చునే వాడిని ఫోన్ చేసి ఎవరైనా అవకాశం కల్పిస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని అని తెలిపారు.

ఇలా తనకు లెజెండ్ సినిమాలో విలన్ గా అవకాశం వచ్చిన తర్వాత వెంటనే ఒప్పుకున్నానని అయితే ప్రస్తుతం తాను విలన్ గానే ఎంతో మంచి గుర్తింపు డబ్బులు కూడా సంపాదించుకున్నానని జగపతిబాబు పలు సందర్భాలలో తెలియజేశారు.ఇకపోతే తన కూతుర్ల గురించి(Jagapathi Babu Daughters) ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ తన పెద్ద కుమార్తె అమెరికాకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు.తన ఇష్ట ప్రకారమే తనని ప్రేమించడంతో తాను కూడా ఇద్దరికీ పెళ్లి చేశాను అని తెలిపారు.

ఇక చిన్నమ్మాయికి తాను పెళ్లి చేసుకోవద్దని నేను సలహా ఇచ్చాను.పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం తన ఇష్టమని ఇక తను పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిని కూడా తానే వెతుక్కోవాలని చెప్పాను.

అంటూ ఈయన షాకింగ్ విషయాలు వెల్లడించారు.

ఇలా పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడం కన్నా పెళ్లిళ్లు చేసుకోకపోవడమే మంచిది అనేది నా ఉద్దేశం అందుకే తన చిన్న కుమార్తెకు పెళ్లి చేసుకోవద్దు అంటూ నేను సలహా ఇచ్చానని తర్వాత తన ఇష్టమని చెప్పుకొచ్చారు.ఇక పెద్దమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత నాన్న నేను పిల్లల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను.మాకు పిల్లలు వద్దు అనుకున్నాము అంటూ చెప్పారు.

అందుకు నేను మీ ఇష్టం అని సమాధానం చెప్పాను అంటూ జగపతిబాబు ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు ఇలా చిన్న కుమార్తెకు పెళ్లి చేసుకోవద్దని సలహా ఇవ్వడం, పెద్ద కుమార్తె పిల్లలు వద్దు అంటే ఒప్పుకున్నారు.అంటే మీరు ఇక తాతయ్య (Grend Father) కాలేరా అంటూ యాంకర్ ప్రశ్నించడంతో… తాత ముత్తాత అయ్యి మనం ఏం చేస్తాము అది పూర్తిగా తన పిల్లల ఇష్టం అంటూ జగపతిబాబు సమాధానం చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=574910311207338
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube