అభ్యర్థులు ఖర్చుల నమోదులో తేడాలు లేకుండా చూసుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికలలో( election ) పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుల నమోదులో తేడాలు లేకుండా చూసుకోవాలనీ ఎన్నికల వ్యయ పరిశీలకులు జి.మణిగండసామి సూచించారు.

 Candidates Should Ensure That There Are No Discrepancies In The Entry Of Expense-TeluguStop.com

శుక్రవారం సిరిసిల్ల, వేములవాడ( Sirisilla, Vemulawada ) రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థుల రోజువారి అకౌంట్ ల మొదటి తనిఖీని వ్యయ పరిశీలకులు చేపట్టారు.

అకౌంటు పుస్తకాలు ,ఓచర్లు, బిల్లులను తగు వివరాలతో పరిశీలించారు.

క్రిమినల్ ఆంటిసిడెంట్స్ , సి -విజిల్, సువిధ , ఎంసీఏంసి తదితర అంశాల గురించి కూలంకషంగా వివరించారు.ఈ సందర్భంగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు అడిగిన సందేహాలను వ్యయ పరిశీలకులు నివృత్తి చేశారు.

మొదటి తనిఖీకి రానివారికి 24 గంటల్లోగా నోటీసులు జారీ చేయాలని రిటర్నింగ్ అధికారులకు వ్యయశీలకులు సూచించారు.ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధు సూదన్, జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ ప్రత్యేక అధికారిని స్వప్న, నోడల్‌ అధికారి రామ కృష్ణ, ,జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, జిల్లా లేబర్ అధికారి రఫీ , చేనేత జౌలి శాఖ జిల్లా అధికారి సాగర్, లైజన్ అధికారి నర్సింహులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube