తుమ్మల గెలుపుపై ఏపీ పాలిటిక్స్ ముడిపడి ఉన్నాయా..?

ప్రస్తుతం తెలంగాణలో( Telangana ) ఏం నడుస్తుందయ్యా అంటే రసవత్తరమైన పాలిటిక్స్ నడుస్తున్నాయని ఎవరైనా చెబుతారు.ఈ క్రమంలో ఓటర్స్ ను ప్రసన్నం చేసుకునేందుకు నేతలంతా ప్రచార హోరులో మునిగిపోయారు.

 Are Ap Politics Linked To Thummala's Win, Thummala Nageswara Rao , Khammam , T-TeluguStop.com

మూడు సభలు, ఆరు మాటల చొప్పున ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు.ఇదే తరుణంలో సీనియర్ లీడర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు( Thummala Nageswara Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.

తన గెలుపు ఓటములపై ఏపీ పాలిటిక్స్ ఆధారపడి ఉన్నాయని చెప్పకనే చెప్పేశారు.ఆయనకు ఏపీ పాలిటిక్స్ కు సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం.

అయితే తుమ్మల నాగేశ్వరరావు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక సభ నిర్వహించారు.ఈ సభలో ఆయన మద్దతుదారులైన టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో మంది పాల్గొన్నారు.

Telugu Andhra Pradesh, Chandra Babu, Chandrababu, Congress, Jagan, Khammam, Ts-P

ఇందులో ఏపీకి చెందిన తెలుగు తమ్ముళ్లు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.వారందరినీ ఉద్దేశించి తుమ్మల కీలకమైన వ్యాఖ్యలు చేశారు.నేను ఖమ్మంలో గెలిస్తే ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంటుందని అన్నారు.ఖమ్మం( Khammam )లో గెలిస్తే తప్పకుండా ఆంధ్ర ప్రదేశ్( AP ) రాష్ట్రంలో టిడిపి( TDP ) అధికారంలోకి వస్తుందని అక్కడి సెంటిమెంటును కొల్లగొట్టారు.

పచ్చ కండువాకు జీవితంలో ఎంతో రుణపడి ఉన్నానని, అందరూ చల్లగా ఉండాలని, మీరంతా తలెత్తుకొని జీవించేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Telugu Andhra Pradesh, Chandra Babu, Chandrababu, Congress, Jagan, Khammam, Ts-P

తెలుగు గడ్డపై పచ్చ జెండా ఎగరాలన్నదే నా ఆశయం అంటూ మనసులో మాట బయటపెట్టారు.తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేశానని ఆ కృతజ్ఞతతో ఏపీ నుంచి ఇంత పెద్ద ఎత్తున తనకు మద్దతు తెలిపేందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు తుమ్మల.ప్రస్తుతం తుమ్మల ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సర్వత్ర ఆసక్తికరంగా మారాయి.

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube