తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కెల్లా కరీంనగర్ జిల్లా ఉద్యమాల గడ్డ.ఏ ఉద్యమంలో అయినా కరీంనగర్ కు( Karimnaga ) చెందిన వ్యక్తులు తప్పనిసరిగా ఉండాల్సిందే.
అలాంటి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.ఇప్పటికే మూడుసార్లు గెలిచి నాలుగో సారీ కూడా విజయం సాధిస్తా అంటూ బీఆర్ఎస్ పార్టీ( BRS party ) నుంచి బరిలో నిలిచారు.
అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బిజెపి కీలక లీడర్ బండి సంజయ్ ఆయనకు పోటీగా వస్తున్నారు.బండి సంజయ్ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.
ఆయన ఇప్పటికే మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు.అంతేకాకుండా కరీంనగర్ లోకాంగ్రెస్ ఓట్లు కూడా బలంగానే ఉన్నాయి.
ఈసారి అక్కడ జెడ్పిటిసి అభ్యర్థి పురమళ్ళ శ్రీనివాస్( Purumalla Srinivas ) బరిలో నిలిచారు.అయితే ఈ ముగ్గురు లీడర్లు ప్రచారంలో మునిగిపోతూ ఎవరికి వారే మేమే గెలుస్తామంటే , మేం గెలుస్తామని అంటున్నారు కరీంనగర్ లో ఈ మూడు పార్టీలలో గెలుపు ఎవరిది అవుతుంది.
ఏ ఓట్లు గెలుపును డిసైడ్ చేస్తాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.కరీంనగర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 340000.వీరిలో మున్నూరు కాపులు 60,800.ముస్లింలు దాదాపు 69,000.వెలమలు 40,000, రెడ్లు 21వేల మంది ఉన్నారు.ప్రస్తుతం గంగుల కమలాకర్( Gangula Kamalakar ) కరీంనగర్ ను కాస్త అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని అక్కడి ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు.
అంతేకాకుండా బండి సంజయ్ ఎంపీగా ఉండి కనీసం కేంద్రం నుంచి ఏమీ తీసుకురాలేదని బండి మీద కూడా కాస్త గుర్రుగా ఉన్నారు.ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పురమళ్ళ శ్రీనివాస్ కరీంనగర్ రూరల్ ఓట్లను మొత్తం తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి గుర్తింపు సాధించి ముందుకు కదులుతున్నారు.
ఈ తరుణంలో కరీంనగర్ లో బండి సంజయ్( Bandi sanjoy ), గంగుల కమలాకర్ బాహబాహీగా ఉన్నారు.ఈ తరుణంలో అక్కడ ముస్లిం ఓట్లు చాలా కీలకం అవ్వనున్నాయి.ఈ క్రమంలో బిజెపి పార్టీ నుంచి బండి సంజయ్ బరిలో ఉన్నారు.
ఇప్పటికే ఆయన హిందు నినాదంతో ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో ముస్లిం ఓటర్లు బండి సంజయ్ కి సపోర్ట్ చేయడం కాస్త కష్టంగానే చెప్పవచ్చు.
వెలమ ఓట్లు గంగులకు మరియు బండి సంజయ్ పంచుకునే అవకాశం కనిపిస్తోంది.ఇద్దరు సమానమైన ఓట్లను నమోదు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ సందర్భంలో ముస్లిం ఓట్లు కీలకం కానున్నాయి.ముస్లిం ఓట్లు ఏ వైపు అయితే టర్న్ అవుతాయో ఆ పార్టీ తప్పనిసరిగా గెలిచే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.