టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు మద్యం కేసులో ఆయన బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అయితే టీడీపీ హయాంలో మద్యం కంపెనీలకు చట్ట విరుద్దంగా అనుమతి ఇచ్చారని కొల్లు రవీంద్రపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఏ2గా ఉన్నారు.
కాగా కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.