తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానున్నారు.
ఈ మేరకు ఖమ్మం, కొత్తగూడెంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరుకానున్నారు.ముందుగా కొత్తగూడెంకు రానున్న కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి వనమాకు మద్ధతుగా ప్రచారం చేయనున్నారు.
తరువాత ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ కు మద్ధతుగా ప్రచారం నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభలకు సర్వం సిద్ధం కాగా పార్టీ శ్రేణులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.