నా కెరియర్ లో ఎక్కువ సినిమాలు విజయ్ తోనే చేశాను... త్రిష కామెంట్స్ వైరల్!

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో హీరో విజయ్ (Vijay ) నటించిన తాజా చిత్రం లియో( Leo ) .ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Actress Trisha Interesting Comments On Hero Vijay , Trisha, Vijay Leo Movie , L-TeluguStop.com

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ సంచలనమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది .ఇక ఈ సినిమా సుమారు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలందరూ కూడా పాల్గొని సందడి చేశారు.

Telugu Kollywood, Leo, Sanjay Dutt, Tollywood, Trisha, Vijay Leo-Movie

ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమంలో హీరోయిన్ త్రిష( Trisha ) మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇప్పటివరకు హీరో విజయ్ త్రిష కాంబినేషన్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే దాదాపు 15 సంవత్సరాలు తర్వాత తిరిగి ఈ జంట ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో త్రిష మాట్లాడుతూ… డైరెక్టర్ లోకేష్ గారు రెండున్నర గంట పాటు కూర్చొని ఈ సినిమా కథ ఎంతో అద్భుతంగా వివరించారు.అయితే ఈయన కథ చెప్పగానే తాను ఎంతో ఇంప్రెస్ అయ్యానని తెలిపారు.

ఆరోజు తాను నాకు ఏ కథ అయితే చెప్పారో తెరపై కూడా అదే చూపించారని త్రిష వెల్లడించారు.

Telugu Kollywood, Leo, Sanjay Dutt, Tollywood, Trisha, Vijay Leo-Movie

ఇక హీరో విజయ్ గురించి మాట్లాడుతూ తిరిగి 15 సంవత్సరాల తర్వాత విజయ్ గారితో నేను నటించడం చాలా ఆనందంగా ఉందని అప్పుడు మా జంటను ఎలా అయితే ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరించారని త్రిష తన సంతోషం వ్యక్తం చేశారు.ఒక స్కూల్లో చదువుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కలిస్తే వారి ఆనందం ఎలా ఉంటుందో ప్రస్తుతం నా ఆనందం కూడా అలాగే ఉందని ఈమె తెలిపారు.ఇక తన సినీ కెరియర్లో ఎక్కువగా నటించింది హీరో విజయ్ తోనే అని ఈమె తెలియజేశారు.

ఇదివరకు మా సినిమాలు చూసిన వారంతా కూడా తిరిగి విజయ్ తో ఎప్పుడూ నటిస్తున్నారు అంటూ అడిగేవారు ఆ అవకాశం ఇన్ని రోజులకు వచ్చిందని ఈమె తెలిపారు.ఇక హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ హీరోయిన్స్ కి కొన్ని సమయాలలో పతనాలు ఉంటాయి.

అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా సంతోషంగా ఉండాలని తెలిపారు.తాను కూడా అలా సంతోషంగా ఉన్నాను కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ త్రిష ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube