సోషల్ మీడియా లో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో సినిమాల కలెక్షన్స్ ని గర్వంగా చెప్పుకొని తిరగడం సర్వసాధారణం.మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కలెక్షన్స్ రికార్డ్స్ చెప్పుకొని సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ చేస్తుంటారు.
వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ చెప్పుకొని గర్వంగా ఫీల్ అభిమానుల వల్ల నిర్మాతలు( Producers ) చాలా ఇబ్బందులను ఎదురుకుంటున్నారు.అభిమానులు సోషల్ మీడియా లో ప్రచారం చేసే కలెక్షన్స్ నంబర్స్ ని నిజం అనుకోని ఐటీ అధికారులు( IT Officers ) ఆ సినిమా నిర్మాతలపై ఐటీ రిటర్న్స్ ని సోదా చెయ్యడం ఇది వరకు చాలా సార్లు జరిగాయి.
ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి కొంతమంది నిర్మాతలు కలెక్షన్స్ బయటకి చెప్పడం మానేశారు.కొంత మంది డైరెక్టర్స్ మాత్రం ధైర్యం గా తమకి వచ్చింది ఇంతే అని పబ్లిక్ గా సోషల్ మీడియా మాధ్యమాలలో చెప్పుకుంటున్నారు.
రీసెంట్ గా విడుదలైన తమిళ సినిమాలు ‘జైలర్’( Jailer ) మరియు ‘లియో’( Leo ) ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ లుగా నిలిచాయి అనేది మనమంతా చూసాము.కేవలం తమిళం లో మాత్రమే కాదు , సౌత్ ఇండియా ని షాక్ చేసాయి ఈ రెండు చిత్రాలు.
అయితే అభిమానులు సోషల్ మీడియా లో ప్రకటించిన వసూళ్లకు, నిర్మాతలు అధికారికంగా ప్రకటించే వసూళ్లకు ( Collections ) చాలా తేడా ఉండడం అనేది ఈ సినిమాలకే చూసాము.ముందుగా ‘జైలర్’ చిత్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ చిత్రానికి మొదటి వారం 460 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు.కానీ ఆ సినిమాని నిర్మించిన సన్ పిక్చర్స్( Sun Pictures ) మాత్రం కేవలం మొదటి వారం లో 420 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చిందని ఒక పోస్టర్ విడుదల చేసింది.దెబ్బకి అభిమానులు మొత్తం సైలెంట్ అయిపోయారు.
ఇక లేటెస్ట్ గా విడుదలైన ‘లియో’ చిత్రానికి కూడా అభిమానులు ఇదే తరహా లో తప్పు ప్రచారం చేసారు.మొదటి వారం లో లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 500 కోట్ల రూపాయిలు వసూలు చేసిందని ఫ్యాన్స్ ప్రచారం చేసుకున్నారు.కానీ వెంటనే నిర్మాతలు అంత వసూళ్లు రాలేదని, మొదటి వారం కేవలం 464 కోట్ల రూపాయిల గ్రాస్ ని మాత్రమే రాబట్టిందని అధికారికంగా ఒక పోస్టర్ ని విడుదల చేసారు.దీంతో అప్పటి వరకు అభిమానులు చేసుకున్న ఫేక్ ప్రచారం మొత్తానికి అడ్డుకట్ట పడినట్టు అయ్యింది.