కలిసి ఏ విధంగా పోరాడుదాం ? లోకేష్ , పవన్ చర్చలు

టిడిపి, జనసేన పార్టీల( TDP and JanaSena ) తొలి సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు రాజమండ్రిలోని హోటల్ మంజీరా లో ప్రారంభమైంది.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలి ?  జనసేన టిడిపిలు  ఉమ్మడిగా ఏ విధమైన కార్యాచరణ రూపొందించుకోవాలి ?  ఏ విధంగా ఎన్నికల్లో పై సాధించాలి అనే విషయంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,( Nara Lokesh ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చర్చించుకున్నారు.  టిడిపి జనసేన సమన్వయ కమిటీ సైతం ఈ భేటీలో పాల్గొంది.ఇరు పార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 How Can We Fight Together Discussions Between Lokesh And Pawan , Tdp, Chand-TeluguStop.com

  ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు ,  కలిసి ముందుకు సాగే అంశాలపై చర్చిస్తున్నారు.

Telugu Ap Tdp, Chandrababu, Jagan, Janasena Tdp, Tdpjanasena, Ysrcp-Politics

లోకేష్ తో పాటు, టిడిపి సమన్వయ కమిటీ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు,( Kinjarapu Atchannaidu ) యనమాల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు .ఇక పవన్ కళ్యాణ్ తో సమన్వయ కమిటీ సమావేశానికి ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ ,  కోటికలపూడి గోవిందరావు , బొమ్మిడి నాయకర్,  ఫాలవలస యశస్విని , మహేంద్ర రెడ్డిలు  పాల్గొన్నారు .సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై ముందుగానే రెండు పార్టీల నేతలు చర్చించుకున్నారు.

Telugu Ap Tdp, Chandrababu, Jagan, Janasena Tdp, Tdpjanasena, Ysrcp-Politics

మరికొద్ది సేపట్లో ఈ సమన్వయ కమిటీ సమావేశం ముగియనుంది.  ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ పై లోకేష్ తో పాటు,  పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు.  దీంతో ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ఏమేమి విషయాలపై చర్చించుకున్నారు ?  భవిష్యత్తు కార్యాచరణ పై ఏ ప్రకటన చేయబోతున్నారు అనేది  ప్రాధాన్యం సంతరించుకుంది.ఇక ఈ భేటీ, అనంతరం నిర్వహించబోయే మీడియా సమావేశం పైన బీజేపీ సైతం ఆరా తీస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube