కలిసి ఏ విధంగా పోరాడుదాం ? లోకేష్ , పవన్ చర్చలు

టిడిపి, జనసేన పార్టీల( TDP And JanaSena ) తొలి సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు రాజమండ్రిలోని హోటల్ మంజీరా లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలి ?  జనసేన టిడిపిలు  ఉమ్మడిగా ఏ విధమైన కార్యాచరణ రూపొందించుకోవాలి ?  ఏ విధంగా ఎన్నికల్లో పై సాధించాలి అనే విషయంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,( Nara Lokesh ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చర్చించుకున్నారు.

  టిడిపి జనసేన సమన్వయ కమిటీ సైతం ఈ భేటీలో పాల్గొంది.ఇరు పార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు ,  కలిసి ముందుకు సాగే అంశాలపై చర్చిస్తున్నారు.

"""/" / లోకేష్ తో పాటు, టిడిపి సమన్వయ కమిటీ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు,( Kinjarapu Atchannaidu ) యనమాల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు .

ఇక పవన్ కళ్యాణ్ తో సమన్వయ కమిటీ సమావేశానికి ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ ,  కోటికలపూడి గోవిందరావు , బొమ్మిడి నాయకర్,  ఫాలవలస యశస్విని , మహేంద్ర రెడ్డిలు  పాల్గొన్నారు .

సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై ముందుగానే రెండు పార్టీల నేతలు చర్చించుకున్నారు. """/" / మరికొద్ది సేపట్లో ఈ సమన్వయ కమిటీ సమావేశం ముగియనుంది.

  ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ పై లోకేష్ తో పాటు,  పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు.

  దీంతో ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ఏమేమి విషయాలపై చర్చించుకున్నారు ?  భవిష్యత్తు కార్యాచరణ పై ఏ ప్రకటన చేయబోతున్నారు అనేది  ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక ఈ భేటీ, అనంతరం నిర్వహించబోయే మీడియా సమావేశం పైన బీజేపీ సైతం ఆరా తీస్తోందట.

పుష్ప 2 పరిస్థితి ఏంటి..? ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది…