ఏపీ సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( AP CM YS Jagan ) రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.

 Happy Dussehra Greetings From Ap Cm Jagan, Ap Government, Dussehra, Ap Cm Jagan,-TeluguStop.com

ముగ్గురమ్మలో మూలపుటమ్మ అనుగ్రహం కోసం.నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారు.

చెడుపై మంచి, దుష్టశక్తులపై దేవతల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి.రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని.

ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.కాగా దసరా పండుగ నేపథ్యంలో అక్టోబర్ 20వ తారీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంద్రకీలాద్రి( Indrakeeladri )లో కొలువైయున్న అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఇదిలా ఉంటే దసరా పండుగ( Dasara Festival ) నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు విద్యాసంస్థలు సెలవులు ప్రకటించడం జరిగింది.దీంతో హైదరాబాద్( Hyderabad ) లో ఏపీ వాసులు ఉద్యోగస్తులు మరియు విద్యార్థులు.

సొంతూళ్లకు పయనం అయ్యారు.దసరాతో పాటు వీకెండ్ రావటంతో.

హైదరాబాద్ మరియు విజయవాడ రూట్ చాలా రద్దీగా మారింది.ముఖ్యంగా విజయవాడ హైవే బిజీగా మారింది.

టోల్ ప్లాజాలు వద్ద వాహనాలు బారుల తీరటంతో భారీగా ట్రాఫిక్ జామ్ నేలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube