జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.ముఖ్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ అంతిమంగా అధికార బారాస కే మేలు జరుగుతుందని అది కాంగ్రెస్ విజయవకాశాలను దెబ్బతీస్తుందని వీరు భావిస్తున్నారు.
ఎందుకంటే మొదటి నుంచి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పై అనుకూల ధోరణిలో ఉంటూ వస్తున్న కెసిఆర్ వ్యవహార శైలి నచ్చని ఆంధ్రమూలాలు ఉన్న కొన్ని వర్గాలు ఈసారి రాబోయే ఎన్నికలలో కేసీఆర్ కు జలక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని దీనిలో తెలుగుదేశం కి బలంగా మద్దతు ఇస్తున్న సామాజిక వర్గంతో పాటు మొదటినుంచి పార్టీకి లాయల్ ఓటర్లుగా ఉన్న బీసీ వర్గాలు కూడా ఉన్నాయని, పైగా తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ అవకాశాల విషయంలో మాత్రం బారస మొండి చేయి చూపిస్తుంది అన్న భావనలో ఉన్న బీసీ వర్గాలు ఈసారి కాంగ్రెస్కు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లుగా అనేక మీడియా సర్వేలు అంచనా వేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం బరిలోకి దిగి తన నేటివ్ ఓటు బ్యాంకును తనవైపు మళ్ళించుకుంటే అది చివరకు అధికార పార్టీకి మేలు జరిగే పరిణామంగా మారుతుంది అన్నది ఈ పరిశీలకుల అంచనా తాలూకు సారాంశం .ఇప్పటికే రెండు పర్యాయాలు తెలంగాణను పాలించిన బారాసపై క్షేత్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చాలానే ఉన్నాయి.సంక్షేమ పథకాల అమలుతోనూ రైతాంగానికి చేసిన మేలుతోనూ కేసీఆర్( CM KCR ) పట్ల కొంత సానుకూలత ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతిపై తెలంగాణ ఓటర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది వినిపిస్తున్న వార్తల సారాంశం.
ఇలాంటి సమయంలో తెలంగాణ టిడిపి తనదైన స్థాయిలో ఓట్లు చీల్చితే మాత్రం అది కాంగ్రెస్కు బారీ దెబ్బ అనే చెప్పాలి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ సైతం తన వీకెండ్ కామెంట్లో తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయకుండా ఉంటేనే బాగుంటుందంటూ అభిప్రాయపడ్డారు.అయితే తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ) మాత్రం ఇప్పటికే తమ పార్టీ 87 స్థానాలకు అభ్యర్థులను ఎన్నిక చేసిందని కూడా ప్రకటించడంతో ఇక తెలుగుదేశం పోటీ అనివార్యంగా మారింది.అంతేకాకుండా ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలపై కూడా కాసాని మండిపడటం గమనార్హం.చంద్రబాబు మద్దతు లేకుండా పార్టీ అధ్యక్షుడు ఇలా మాట్లాడతారని ఊహించడం కుదరే పని కాదు.
దాంతో తెలంగాణలో తెలుగుదేశం పోటీకి చంద్రబాబు ఉత్సాహంతోనే ఉన్నట్లుగా అర్థమవుతుంది .