పాములు( snakes ) సాధారణంగా వాటి జోలికి వెల్లనంత వరకు ఎవరికీ ఏ హాని చేయవు.అయితే ఎంతటి ధీరుడైనా దానికి ఎదురెళ్ళేటప్పుడు మాత్రం అవి ఏమాత్రం ఉపేక్షించవు.
పాము పగ గురించి మనం అనేక కధలు విన్నాం కదా.ఇపుడు అది నిజమే అనిపిస్తుంది ఇక్కడ వీడియో చూశాక.అవును, కొందరు మనచుట్టూ ఊరికే ఉండక ఎల్లపుడూ అనవసర సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు.అలాంటి వ్యక్తి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.వీడియోని గమనిస్తే, ఓ వ్యక్తి తన వాహనంపై వెళుతుండగా దారిలో ఓ పాము రోడ్డుకు అడ్డంగా కనిపించింది.ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా దాన్ని అదిరించి, బెదిరించి తోలేందుకు ప్రయత్నిస్తారు.
కానీ వీడియోలోని వ్యక్తి దానికి విరుద్ధంగా ప్రవర్తించాడు.

పడగవిప్పుకుని తనవైపు చూస్తున్న పాముని చూసి అతడు తన దగ్గర వున్న గన్నుని తీశాడు.తరువాత పాము పడగని కాల్చేందుకు గురి పెట్టాడు.సరిగ్గా పాము పడగకు తగిలేలా గున్నును గురిపెట్టాడు.
గురి కుదిరిందనుకున్నాక కాల్చాడు. మొదటి సారి బుల్లెట్ వెళ్లి నేలకు తాకడంతో అతడు రెండో మారూ ప్రయత్నించాడు.
ఈ సారి కూడా గురి తప్పడం కొసమెరుపు.కానీ అప్పటికే పాముకు కోపం నషాలానికి ఎక్కింది.
రెండోసారి గురి తప్పగానే రెచ్చిపోయిన పాము కారులో ఉన్న అతడివైపు దూసుకుంటూ వచ్చేసింది.

దాంతో అక్కడి తంతుని రికార్డు చేస్తున్న అతడు ఒక్కసారిగా కంగారు పడిపోయాడు.వెంటనే కారును స్టార్ట్ చేసి అక్కడి నుంచి పరుగోపరుగు.దాంతో వీడియో చూసిన నెటిజన్లు అతడి పరిస్థితికి కడుపుబ్బా నవ్వుకుంటూనే మరోవైపు తిట్టిపోస్తున్నారు.
అవును, చాలామంది అతగాడికి మొట్టికాయలు వేస్తున్నారు.ఓ మూగ జీవిపై అలా అకారణంగా కాల్పులకు ఎందుకు దిగారు అని కామెంట్స్ చేస్తున్నారు.







