చదువుతానని తీసుకెళ్లిన పుస్తకం 90 ఏళ్ల తర్వాత లైబ్రరీకి వచ్చింది.. ఫైన్ ఎంత వేశారంటే?

జ్ఞానాన్ని అందించే దేవాలయాలను లైబ్రరీలుతో మనం పోలుస్తారు పెద్దలు.అందుకే పుస్తకాలు చదవలనే కుతూహలం వున్నవారితో లైబ్రరీలు( Library ) నిత్యం నిండిపోయి వుంటాయి.

 After 90 Years A Book Finds Its Way Back To A New York Library Details, Book ,-TeluguStop.com

ఈ క్రమంలోనే గ్రంథాలయాలకు వెళ్లి చదువుకోవడానికి స్టూడెంట్స్ కు మాత్రమే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వెళ్తారు.ఎందుకంటే పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ దాదాపు అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి.

అక్కడ పుస్తకాలను చదువుకోవడానికి ఇంటికి కూడా ఇస్తూ వుంటారు.కొందరు తాము చదవడం కంప్లీట్ అయిన వెంటనే తిరిగి ఇచ్చేస్తే.

మరొకొందరు మరచిపోవడం లేదా ఏదైనా కారణం వలన తాము లైబ్రెరీ నుంచి తెచ్చిన పుస్తకం ( Book ) లైబ్రెరీకి తిరిగి ఇవ్వడం అనేది జరగదు.

ఇలాంటి ఘటనకి సంబందించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.కాగా ఇది ప్రజలను మిక్కిలి ఆశ్చర్యపరుస్తుంది.ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌ లో( Newyork ) చోటు చేసుకోగా విషయం అంతర్జాతీయంగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.జిమ్మీ ఎనే ఒకతను సదరు పుస్తకాన్ని చదవడానికి తీసుకొని లైబ్రరీకి తిరిగి ఇవ్వడం మర్చిపోయాడు.

పుస్తకం చాలా సంవత్సరాలు అతని ఇంట్లో ఉండిపోయింది.ఇంతలో, అతను 1978 సంవత్సరంలో మరణించాడు.

జిమ్మీ మరణానంతరం అతని కుమార్తె అయినటువంటి జోనీ మోర్గాన్( Joanie Morgan ) కూడా ఆ పుస్తకాన్ని గమనించలేదు.దాంతో చాలా ఏళ్లు ఇంటిలో ఆ పుస్తకం ఉండిపోయింది.

ఒకరోజు జిమ్మీ కూతురు జానీ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని చూసింది.ఏమిటా అని ఆసక్తితో చూడగా.ఆ పుస్తకం మీద దానిపై లార్చ్‌మాంట్ పబ్లిక్ లైబ్రరీ( Larchmont Public Library ) అనే ట్యాగ్ కనిపించింది ఆమెకు.దీంతో జానీ ఆ పుస్తకాన్ని లైబ్రరీకి తిరిగి ఇవ్వాలని నిశ్చయించుకుంది.

ఈ విషయమై లైబ్రేరియన్ కరోలిన్ కన్నింగ్‌హామ్ మాట్లాడుతూ.జానీ మోర్గాన్ నుండి తనకు ఓ పురాతన పుస్తకం తిరిగి ఇవ్వబడిందని చెప్పింది.

ఆ పుస్తకం ఆమె తండ్రి సుమారు 90 ఏళ్ల క్రితం తీసుకుని వెళ్ళినదట.ఈ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయానని ఆమె చెప్పింది.అయితే ఈ పుస్తకాన్ని ఆలస్యంగా తిరిగి ఇచ్చినందుకు లైబ్రరీ జానీకి 5 డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.417 జరిమానా విధించినట్టు చెప్పుకొచ్చింది.

Library book overdue by 90 years gets returned

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube