వైసిపి బస్సు యాత్ర  ! షెడ్యూల్ ఈ విధంగా ...

పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన ఏపీ అధికార పార్టీ వైసిపి పార్టీ శ్రేణులను ప్రజలకు మరింత దగ్గర చేసే విధంగా అనేక కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.ఇటీవల విజయవాడలో వైసీపీ ప్రజా ప్రతినిధుల సదస్సును భారీగా నిర్వహించారు.

 Ycp Bus Trip The Schedule Is As Follows , Ys Jagan, Ysrcp, Ap Government, Td-TeluguStop.com

ఈ సందర్భంగా అనేక విషయాలపై జగన్ క్లారిటీ ఇచ్చారు.ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో,  ప్రజల్లోనే ఉండేందుకు జగన్( CM jagan ) కూడా నిర్ణయించుకున్నారు.

ఎన్నికలకు కీలకమైన ఈ ఆరు నెలలు పూర్తిగా ప్రజలకు దగ్గర అయ్యేందుకు జగన్ నిర్ణయించుకున్నారు .టిడిపి చంద్రబాబు వారెస్టు వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ , పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది .వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు ( Chandrababu arrest )వ్యవహారం పైనే జనాలు సెంటిమెంటు ను రగిల్చే పనిలో నిమగ్నమయ్యారు.

Telugu Ap, Janasena, Ys Jagan, Ysrcp-Politics

దీంతో జనాల్లో సెంటిమెంట్ లేకుండా చేసే విధంగా గత టిడిపి ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి , ఆ పార్టీపై పై చేయి సాధించే వ్యూహం తో జగన్ ఉన్నారు.  దీనిలో భాగంగానే వైసీపీ సామాజిక బస్సు యాత్ర చేపట్టేందుకు నిర్ణయించారు.  ఈ మేరకు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది.

  అక్టోబర్ 26 నుంచి వచ్చే నెల 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర ( Bus yathra )జరగనుంది.  ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర మొదలు కానుండగా,  అనకాపల్లిలో ముగియనుంది .తొలి విడత 13 రోజుల పాటు ఈ యాత్ర జరగనుండగా ,  ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

Telugu Ap, Janasena, Ys Jagan, Ysrcp-Politics

అలాగే ఈ నెల 26 ఇచ్చాపురంలో ,   27న గజపతినగరం , 28న భీమిలి , 30న పాడేరు 31న , ఆముదాలవలస నవంబర్ 1న పార్వతీపురం , నవంబర్ 2న మాడుగుల,  నవంబర్ మూడన నరసన్నపేట,  నవంబర్ 4న శృంగవరపుకోట , నవంబర్ 5న గాజువాక , నవంబర్ 7న రాజాం నవంబర్ 8న సాలూరు , నవంబర్ 9న అనకాపల్లిలో బస్సు యాత్ర జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube