ఈ రోజుల్లో ప్రతీఒక్కరి ఇంట్లో బైక్ అనేది ఉంటుంది.సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్లల్లో కూడా బైక్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.
ఇక కారు కూడా ఎక్కువైపోతున్నాయి.సంపన్నుల కుటుంబాల్లోనే కాకుండా ఇటీవల మధ్యతరగతి కుటుంబాలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నాయి.
ఇక ప్రత్యేక విమానం అంటే పెద్ద పెద్ద వీవీఐపీలు, బిలియనర్లు, మిలియనీర్లకు ఉంటాయి.మధ్యతరగతి ప్రజలకు విమానం( Flight ) ఎక్కాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని.కానీ ప్రత్యేక విమానం అంటే సాధ్యం కానీ పని.
కానీ ఒక గ్రామంలో మాత్రం ప్రతీ ఇంటికి ప్రత్యేక విమానం ఉంది.ప్రతీ ఇంట్లో బైక్( Bike ) ఉన్న మాదిరిగానే అక్కడ ప్రతీ ఇంటికి ఒక ప్రత్యేక ఫ్లైట్ ఉంది.మనం ఎక్కడికైనా బయటికి వెళ్లాలంటే బైక్, కారులో వెళ్లినట్లే వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే విమానంలోనే వెళతారు.
ప్రతి రోజూ ఎక్కడికైనా ప్రయాణాల కోసం విమానాలనే వాడతారు.విమానాలు నడపడానికి పైలెట్( Pilot ) కూడా ఉండరు.
వీళ్లే స్వయంగా తమ ఫ్లైట్ నడుపుకుని వెళతారు.అమెరికాలోని కాలిఫోర్నియాలోని కామెరాన్ ఎయిర్ పార్క్( Cameron AirPark ) అనే చిన్న గ్రామంలో ప్రతీ ఇంటికి ఫ్లైట్ ఉంది.
పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ ను( Special Jet ) వాడతారు.కానీ కామెరాన్ ఎయిర్ పార్క్ అనే గ్రామంలో ప్రతి ఇంటికి ఒక చిన్న విమానం ఉంది.దీంతో ఈ విలేజ్ ను ఫ్లై ఇన్ కమ్యూనిటీ( Fly-in Community ) అని కూడా పిలుస్తున్నారు.వ్యక్తిగత, వృతిరీత్యా, వ్యాపార ప్రయోజనాల కోసం ఈ ప్రత్యేక విమానాలను వాడుతున్నారు.
ఇంటి ముందే ఎవరికి విమానాన్ని వాళ్లు పార్కింగ్ చేసుకుంటారు.ఇక విమానం నడపడానికి ఈ గ్రామంలో అందరికీ లైసెన్స్ ఉంది.
ఈ గ్రామంలోకి వేరేవాళ్లు ప్రయాణించాలంటే అక్కడి స్థానికుల అనుమతి తీసుకోవాలి.