డైరెక్ట్-టు-కస్టమర్ మార్కెట్‌లోకి రన్‌ఆర్ కంపెనీ ఎంట్రీ.. త్వరలోనే 200 ఎలక్ట్రిక్ స్కూటర్లను సేల్..

ఎలక్ట్రిక్ స్కూటర్లను( Electric Scooters ) తయారు చేసే రన్‌ఆర్ మొబిలిటీ కంపెనీ ఇప్పుడు వ్యాపారాలకు బదులుగా నేరుగా వినియోగదారులకు వెహికల్స్ విక్రయించడం మొదలు పెట్టింది.ఈ నెలాఖరులోగా 200 ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రజలకు నేరుగా అమ్మేందుకు కొత్త డీలర్‌షిప్‌లను కూడా తెరుస్తారు, ఇక్కడ ప్రజలు వాటిని టెస్ట్ రైడ్ చేయవచ్చు.

 Runr Mobility Hs Ev Electric Scooter Features,runr Mobility, Hs Ev Electric Scoo-TeluguStop.com

రన్‌ఆర్ ఈ ఏడాది 40 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలనుకుంటోంది.

Telugu Automobiles, Hsev, Scooters, Runr Mobility-Latest News - Telugu

రన్‌ఆర్ మొబిలిటీ భారతదేశంలో హెచ్ఎస్ ఈవీ( RunR Mobility HS EV ) అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తుంది.ప్రభుత్వ సబ్సిడీల కాక దీని ధర రూ.1.25 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు ఉంటుంది.ఇది తెలుపు, నలుపు, బూడిద, ఎరుపు, ఆకుపచ్చ వంటి ఐదు రంగులలో వస్తుంది.

హెచ్ఎస్ ఈవీ 60 V 40 AH లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది, అది లిక్విడ్-కూల్డ్.బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) ఆర్ట్‌కాన్-ఆధారితమైనది, స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై 110 కిమీల క్లెయిమ్ పరిధిని కలిగి ఉంది.ఇది 70 kmph గరిష్ట వేగంతో వెళ్తుంది, 1.5 kW BLDC మోటార్ కలిగి ఉంది.

Telugu Automobiles, Hsev, Scooters, Runr Mobility-Latest News - Telugu

రన్‌ఆర్ హెచ్ఎస్ ఈవీ అనేక రకాల ఫీచర్లతో వస్తుంది, అవేవో తెలుసుకుంటే, స్పీడ్, బ్యాటరీ లెవెల్ , ప్రయాణించిన దూరం వంటి ముఖ్యమైన సమాచారాన్ని రైడర్‌కు చూపే డిజిటల్ స్క్రీన్.స్కూటర్ దొంగిలించబడితే దాన్ని ట్రాక్ చేసే యాంటీ-థెఫ్ట్ వెహికల్ లొకేటర్.రిమోట్ ఫ్లీట్ మేనేజ్‌మెంట్, ఓవర్-ది-ఎయిర్ ( OTA ) అప్‌డేట్‌లు, వీటితో మీ స్కూటర్ సాఫ్ట్‌వేర్‌ను అప్-టు-డేట్‌గా ఉంచుకోవచ్చు.ట్యూబ్‌లెస్ టైర్‌లతో అల్లాయ్ వీల్స్.ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, హెడ్‌ల్యాంప్.స్కూటర్ లుక్ మెరుగుపరచడానికి ఎల్ఈడీ లైట్ స్ట్రిప్.

ముందు ఆప్రాన్‌లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ ఇందులో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube