టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్( Nithya Menen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిత్యా మీనన్ కాస్త ఎత్తు తక్కువై ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ లేకపోతే సౌత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీలలో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కేది.
అయినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు.తెలుగు లోనూ నిత్యా మీనన్‌ను ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువే.
అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆ తరవాత అన్నీ మంచి మంచి పాత్రలే చేశారు.గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్నారు.
కథ నచ్చితేనే సినిమా ఓకే చేసే నిత్యామీనన్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్, షోలు కూడా చేస్తోంది. ఆహాలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో జడ్జిగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఇకపోతే ఇటీవలే భీమ్లా నాయక్( Bheemla Nayak ) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.అలాగే కుమారి శ్రీమతి( Kumari Srimathi ) అనే వెబ్‌సిరీస్‌తో పలకరించి మరోసారి అందరినీ ఆకట్టుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన విషయాల గురించి కథల ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ.
నేను పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిల్లోనే నటించాలని ఆలోచించను.
ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి పాత్ర అయితే నటిస్తాను.కమర్షియల్ చిత్రాల్లోనే చేయాలన్న నిబంధన పెట్టుకోలేదు.నాకు కథలు నచ్చక చాలా వాటిని తిరస్కరించాను.
కథకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాను.ఇక నా నటనకు నేను ఎలాంటి భాషా పరిమితులు పెట్టుకోలేదు.
కానీ, మీరు తమిళ సినిమాలు ఎక్కువ చేయొచ్చు కదా, తెలుగులో నటించొచ్చు కదా అంటూ ఇలా బయట వ్యక్తులు అడుగుతుంటారు.నేను తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడగలను.
ఏదైనా సినిమా, వెబ్ సిరీస్‌లో అవకాశం వచ్చినప్పుడు దాని స్క్రిప్ట్ మాత్రమే చదువుతాను.అంతేకానీ అది ఏభాష అని చూడను.
భాషతో సంబంధం లేకుండా నా వద్దకు వచ్చిన ప్రతి స్క్రిప్ట్‌ను చదువుతాను అని చెప్పుకొచ్చింది నిత్యామీనన్
.