బోయినపల్లి లో ఘనంగా వెదురు దినోత్సవ వేడుకలు

ప్రపంచ వెదురు దినోత్సవన్ని( World Bamboo Day ) పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎదురు బొంగుతో చేసిన వస్తువులతో మండల కేంద్రానికి ర్యాలీగా అనంతరం మేదర సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని మేదర్లను ఎస్టీ జాబితా లో చేర్చాలని అన్నారు.

 Bamboo Day Celebrations In Boinpalli, Boinpalli,bamboo Day Celebrations ,bamboo-TeluguStop.com

బీసీ బందు లాగానే మేదరి బంధు పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వెదురు రేటు( Bamboo Price ) తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మేదరులకు వెదురు మొక్కలు పెంచుకునేందుకు 5 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వ కార్యాలయంలో వెదురు ఉత్పత్తులు వాడకాన్ని ప్రోత్సహించాలని,మండల మేదరి సంఘం భవనానికి ఐదు గుంటల స్థలాన్ని కేటాయించాలని,50 సంవత్సరాల నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వానీ ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుల్ల బాలయ్య, గౌరవాధ్యక్షులు గుల్ల రాజయ్య, ఉపాధ్యక్షులు రఘుపతి,ప్రధాన కార్యదర్శి పోతు ప్రవీణ్ నాయకులు నరేష్ ,గుల్ల శ్రీనివాస్, పోతు దేవయ్య, వేముల భీమయ్య, వేముల శ్రీనివాస్, నర్సయ్య, లింగవ్వ, కనుకయ్య,కిషన్ లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube