బాబుపై మరో కేసుతో సిద్ధమైన జగన్ సర్కార్?

ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసు( Skill development )లో చంద్రబాబును ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తున్న జగన్ సర్కార్ చట్టపరంగా ఏ విధమైన ఉపశమనం బాబుకు కలుగ కూడదన్న పట్టుదలను పదర్శిస్తుంది .స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ను తొలగించేలా క్యాష్ పిటిషన్ ఏపీ హైకోర్టులో మూవ్ చేస్తున్న తెలుగుదేశం లీగల్ టీం సిద్ధార్థ లుధ్రా( Sidharth Luthra ) తో పాటు మరో సీనియర్ లాయర్ హరీష్ సాల్వే ను కూడా నియమించుకుంది .

 Jagan Sarkar Ready With Another Case Against Babu, Sidharth Luthra , Chandra B-TeluguStop.com

వీరు చంద్రబాబు రిమాండ్ ను క్వాష్ చేసేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు .రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి రెండు రోజుల్లో ఫలితం వెల్లడిస్తానని చెప్పింది.అయితే మరోవైపు చంద్రబాబును కస్టడీ కి ఇవ్వాలని సిబిఐ కోర్టు లో సిఐడి వేసిన కేసు రేపటికి వాయిదా పడింది .మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలపై , పుంగనూరు అల్లర్లపై రెండు కేసులను ఇప్పటికే బాబు పై రిజిస్టర్ చేసిన ఏపీ సర్కార్ ఇప్పుడు మరో కేసు తో ముందుకు వచ్చింది.

Telugu Ap, Chandra Babu, Fiber Grid, Sidharth Luthra, Terra Soft, Ys Jagan-Telug

ఏపీ ప్రబుత్వ హయం లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫైబర్ గ్రిడ్( Fiber grid ) పథకంలో 120 కోట్ల మేర అవినీతి జరిగిందని ఈ కేసులో ఏ- వన్ గా ఉన్న వేమూరి హరిప్రసాద్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని, అప్పట్లో టెర్రా సాఫ్ట్( Terra Soft ) కు జరిగిన కేటాయింపుల్లో అనేక అవకతవకులు ఉన్నాయని ,నిబంధనలను అతిక్రమించి సంస్థకు కేటాయింపులు చేశారని, ఇందులో పెద్ద మొత్తం చేతులు మారింది అంటూ సి ఐ డి వాదిస్తుంది.ఒకవేళ ఏపీ హైకోర్టులో ఏ విధమైన రిలీఫ్ దొరికి చంద్రబాబును రిలీజ్ చేస్తే వెంటనే ఈ కేస్ తో చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాలని ఏపీ సిఐడి వ్యూహాత్మకంగా ముందు కదులుతున్నట్లుగా తెలుస్తుంది.ఏది ఏమైనా సుధీర్గ కాలం పాటు బాబును జైల్లోనే ఉంచే విధంగా వైసిపి సర్కార్ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Chandra Babu, Fiber Grid, Sidharth Luthra, Terra Soft, Ys Jagan-Telug

అయితే ప్రభుత్వం పెడుతున్న కేసులు ఉద్దేశం పూర్వకంగానే పెడుతున్నవని రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ సర్కార్ ఈ విధంగా బాబుని ఇబ్బంది పేడుతుందని చంద్రబాబు తరుపు లాయర్లు కోర్టులో నిరూపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి వరకూ అవి విజయవంతం కాలేదు .మరి బాబుకు ఉపశమనం దొరుకుతుందా లేదో మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube