లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు సభా ఆమోదం పొందితే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు.కాగా రేపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ జరగనుంది.
చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.దీంతో 82 ఉన్న మహిళా ఎంపీ స్థానాలు 182 కు పెరగనున్నాయి.
మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో విపక్ష పార్టీ సభ్యులు నిరసనకు దిగారు.బిల్లు కాపీ అందజేయలేదని ఆరోపించారు.
అనంతరం లోక్ సభ రేపటికి వాయిదా పడింది.