ప్రైవేట్ ఫైనాన్షియరులు, లోన్ యాప్ నిర్వాహకుల( Loan App ) నుండి డబ్బులు తీసుకుని సకాలంలో చెల్లించకపోతే ఇక అంతే సంగతులు.ఎంతకైనా తెగించి ప్రతిదాడి చేసేందుకు సిద్ధమవుతారు.
ఈమధ్య అయితే ఫైనాన్షియర్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.చాలామంది వీరి వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా ప్రైవేట్ ఫైనాన్షియల్ వేధింపుల కారణంగా ఓ మాజీ హోంగార్డ్ మృతి చెందాడు.ఈ ఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే భాను నగర్ లో చోటుచేసుకుంది అందుకు సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం.
వివరాల్లోకెళితే.భాను నగర్ లో ఉండే మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి గతంలో హోంగార్డుగా పనిచేసేవాడు.రిజ్వాన్ కు డబ్బు అవసరం ఉండడంతో ప్రైవేట్ ఫైనాన్షియల్ సలీం అనే వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు.మొదట్లో క్రమంగా డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు.
అయితే రిజ్వాన్ కు ఆర్థిక సమస్యలు( Financial Problems ) కాస్త అధికం అవడంతో డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేసేవాడు.ప్రైవేట్ ఫైనాన్షియర్ సలీం( Private Financier Saleem ) అతన్ని ఆలస్యంగా ఇస్తున్నామని మందలించేవాడు.
అంతేకాకుండా అత్యధికంగా డబ్బులు ఇవ్వాలని, ఎక్కువ వడ్డీ కట్టాలని రిజ్వాన్ కు వేధింపులు మొదలయ్యాయి.సలీం వేధింపులు భరించలేకపోయిన రిజ్వాన్ వడ్డీతో సహా మొత్తం డబ్బు చెల్లించాడు.
అప్పు మొత్తం తీరిపోయిన కూడా సలీం చక్రవడ్డీ ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో ఈ నెల 12న మాట్లాడేందుకు రిజ్వాన్ పిలిపించి ఓ రహస్య ప్రాంతంలో బంధించి రెండు రోజులపాటు చిత్రహింసలకు గురిచేశాడు.రిజ్వాన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.రిజ్వాన్ తండ్రి అంత డబ్బులు ఇవ్వలేదని రెండు లక్షల రూపాయలు ఇచ్చి రిజ్వాన్ ను విడిపించుకున్నాడు.
అప్పటికే దాదాపుగా 15 మందికి పైగా వ్యక్తులు రెండు రోజులపాటు మద్యం సేవిస్తూ రిజ్వాన్ ను విచక్షణ రహితంగా కొట్టారు.
తీవ్ర గాయాలైన రిజ్వాన్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తమ బిడ్డను చిత్రహింసలకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.