సోషల్ మీడియా( Social Media ) అందుబాటులోకి వచ్చాక ఎక్కడెక్కడో జరిగిన వింత వింత విశేషాలను మనం తెలుసుకోగలుగుతున్నాం.ఈ క్రమంలో అనేకమంది ఫ్రాంక్ వీడియోలు తీయడం మొదలు పెట్టారు.
అలాంటి వీడియోలకు కూడా సోషల్ మీడియాలో మంచి గిరాకీ వుంది.చాలామంది కేవలం ప్రాంక్స్ చేస్తూ లక్షల్లో డబ్బులు గడిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో! అయితే ఈ ప్రాంక్స్ ఈమధ్యన మొదలవ్వలేదు.
మనం మన చిన్నప్పటి నుండీ చూస్తూ వున్నాం.అయితే అప్పట్లో సోషల్ మీడియా అనేది లేదు.
ఇక పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలతో పాటు మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల పుట్టిన రోజుకో బహుమతుల రూపంలో ఇవ్వాల్సింది ఒకటైతే మరొకటి ఇస్తూ ప్రాంక్స్ చేయడం మనకి కొత్తకాదు.అయితే ఎలాంటివారైనా తమ కన్న తల్లిపైన ప్రాంక్స్( Prank on Mother ) చేసేటప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం ఏదో ఒకటి చేసి, ప్లాన్ చేసి ఆరోజుని జీవితంలో మరిచిపోలేని విధంగా ప్లాన్ చేస్తూ వుంటారు.అయితే ఇక్కడ వైరల్ అవురున్న వీడియోలో కొడుకు మాత్రం తన తల్లికి షాక్ ఇచ్చాడు.
వివరాల్లోకి వెళితే, సర్ ఫ్రైజ్ గిఫ్ట్( Surprise Gift ) పేరుతో తన తల్లిని భయపెట్టాడు ఓ కొడుకు.వైరల్ అవుతున్న వీడియోలో తల్లి తన పుట్టిన రోజుకు వచ్చిన బహుమతి చూసి షాక్ తింది.అవును, తన కొడుకు చేసిన పనికి ఆ మహిళకు దాదాపు గుండెపోటు వచ్చినంత పనైంది.
కొడుకు తెచ్చిచ్చిన ఆ పెట్టెలో ఏదో ప్రత్యేక మైన బహుమతి ఉన్నట్లు భావించి ఆమె మొదట చాలా ఆశ్చర్యపోతుంది.కానీ పెట్టె తెరవగానే భయంతో పారిపోయింది.ఆమె భయంతో వణికింది.ఎందుకంటే నిజానికి ఆ పెట్టెలో పాము( Snake ) ఉంది.
అకస్మాత్తుగా పామును చూసిన ఆమె గుండాగినంత పని అవుతుంది.కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం ఆ పుత్రరత్నానికి ఓ రేంజులో ఏసుకుంటున్నారు.