ఇప్పుడు ఏ ఇంట్లో చుసిన విక్రమ్, జైలర్ మరియు జవాన్ సినిమా( Jawan Movie ) పాటల మోత మాత్రమే వినిపిస్తుంది.అస్సలు ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ ఒక్కటి చాలు సినిమాను లేపి కూర్చోబెట్టడానికి.
రజినీకాంత్ అనే కొండంత శిఖరం తన వెనక ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ దొరకడం పెద్ద కష్టం ఏమి కాదు. రజినీకాంత్( Rajinikanth ) భార్య లతా స్వయానా తమ్ముడి కొడుకే ఈ అనిరుద్ రవిచంద్రన్.
( Anirudh ravichandar ) చుడానికి నలభై కేజీలు కూడా ఉంటాడో ఉండడో.పైగా ఆ బక్క పర్శనాలిటీ కి బోలెడన్ని లవ్ అఫైర్స్.
ఆ మధ్య లిప్ లాక్ ఫోటోలు బయటకు వస్తే కానీ తెలియలేదు మనోడి సత్తా ఏంటో అని.

తన మీద బోలెడన్ని రూమర్స్ ఉన్న కూడా ధనుష్ తో గట్టి అనుబంధం ఉండటం తో రజిని బలం కూడా తోడవ్వడం తో సినిమా ఇండస్ట్రీ ని ఏలేద్దామని గట్టిగానే డిసైడ్ అయ్యాడు.ఆలా ఐశ్వర్య తీసిన ౩ సినిమాతో మొదలెట్టి నేటి జవాన్ వరకు తన ప్రయాణం బాగానే సాగుతుంది.ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న కూడా ట్యాలెంట్ లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతారు.
కానీ అనిరుద్ విషయంలో అలంటి ప్రాబ్లమ్ లేదు.అతడు లండన్ లో ట్రినిటీ నుంచి సంగీతంలో డిగ్రీ పట్టా పొందాడు.
అతడి తల్లి లక్ష్మి ఒక క్లాసికల్ డ్యాన్సర్.అంతే కాదు తండ్రి రవి రాఘవేంద్ర నటనలో ఉన్నాడు.
ఇలా కళాకారుల ఇంత పుట్టిన అనిరుద్ స్వతహాగానే సంగీతం పైన పట్టు సాధించాడు.

మొన్నామధ్య జైలర్ సినిమా( Jailer movie ) సందర్భం గా ఒక మీమ్ బాగా వైరల్ అయ్యింది.తలైవా మీరు ఆలా కూర్చొని ఉండండి.మిగతా అంత నేను నడిపిస్తాను అని అనిరుద్ చెప్పినట్టు గా ఉంటుంది ఆ మీమ్.
అలాగే చెప్పినట్టుగానే సినిమాను సంగీతం( Music ) తో హోరెత్తించాడు.పైగా అతడు స్టేజి పైన దూకుతూ పాడుతూ చేసిన హడావిడి మాములుగా లేదు.
ముందుముందు కూడా అనిరుద్ తన సినిమాలను బ్యాగ్రౌండ్ స్కోర్ తో చితకొడతాడు.అందులో ఎలాంటి సందేహం లేదు.