నెలరోజుల గ్యాప్ లో మూడు మెగా హీరోల సినిమాలు విడుదలయ్యాయి.బ్రో, భోళా శంకర్, గాండీవదారి అర్జున ( Gandeevadhari Arjuna )భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల కాగ ఈ సినిమాలలో బ్రో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా భోళా శంకర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
గాండీవధారి అర్జున సినిమాకు మాత్రం ఏకంగా డిజాస్టర్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.
బ్రో, భోళా శంకర్, ( Bhola Shankar )గాండీవదారి అర్జున సినిమాలు మిగిల్చిన నష్టాల లెక్క 120 కోట్ల రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.ఈ సినిమాలు భారీ నష్టాలను మిగల్చడంతో నిర్మాతలకు షాకిచ్చాయి.
ఈ సినిమాల ఫలితాలు మెగా హీరోల పారితోషికాలపై కూడా ప్రభావం చూపాయని సమాచారం అందుతోంది.మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో మెగా ఫ్యాన్స్ సైతం ఒకింత ఫీలవుతున్నారు.
మెగా హీరోల కొత్త ప్రాజెక్ట్ లపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.వరుణ్ తేజ్ ( Varun Tej )మట్కా సినిమాతో బిజీ అవుతుండగా పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ), హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు.చిరంజీవి వశిష్ట, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది.ఈ ఆరు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
మెగా హీరోలు కథల ఎంపికతో పాటు డైరెక్టర్ల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ పారితోషికం 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా చిరంజీవి పారితోషికం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా వరుణ్ తేజ్ పారితోషికం 9 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.మెగా హీరోలు తర్వాత సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.