ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి పంచభూతాలు సకల ప్రాణికోటికి జీవనాధారాలు అని చాలామందికి తెలుసు.శివ పంచాక్షరి( Shiva Panchakshari ) మంత్రమైనా న-మ-శి-వా-య అనే బీజక్షరాల నుంచి పంచభూతాలు వచ్చాయని వాటి నుంచి సమస్త విశ్వం పుట్టిందని పండితులు చెబుతున్నారు.
పరమేశ్వరుడిని లింగ రూపంలో దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.శివాలయాలు ఎన్ని ఉన్నా కేవలం పంచాత్మక స్వరూపుడిగా శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాలు కూడా ఉన్నాయి.
ఆ క్షేత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం వీటినే పంచభూతలింగాలు( Panchabhutalingas ) అని అంటారు.
వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడులో( Tamil Nadu ) ఉండగా ఒకటి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశ లింగం తమిళనాడు చిదంబరంలో ఉంది.
పరమశివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు.
ఈ దేవాలయానికి ఉన్న తొమ్మిది ద్వారాలను నవరంద్రాలకు సూచికలుగా చెబుతారు.ఇంకా చెప్పాలంటే పంచభూతాలలో పృథ్వీలింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచి లో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం.
ఈ శివలింగాన్ని పార్వతి దేవి ( Goddess Parvati )మట్టితో తయారు చేసిందని స్థానికులు చెబుతున్నారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభుగా వెలిసిన వాయులింగం ఉంది.ఈ ఆలయం గర్భ ఆలయంలోకి గాలి రావడానికి అవకాశం ఉండదు.అగమశాస్త్రం ప్రకారం గర్భగుడిని అలాగే నిర్మిస్తారు.ఇంకా చెప్పాలంటే తమిళనాడులో కొలువైన మరో పంచభూతా లింగ క్షేత్రం జంబుకేశ్వరం.శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నమైన శివుడు లింగ రూపంలో వెలిసాడని స్థానికులు చెబుతున్నారు.
కావేరీ నది తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది( Jambukeshwar ) జలతత్వం.అందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది.అంతేకాకుండా కొండ మీద వెలిసి దేవుని చూశాము కానీ దేవుడే కొండపై వెలిసిన క్షేత్రం అరుణాచలం.ఇక్కడి స్వామిని అణ్ణామలై అని కూడా పిలుస్తారు.శివుడు అగ్నిలింగంగా వెలిసిన క్షేత్రమే ఈ అరుణాచలం.అగ్నితత్వానికి గుర్తుగా ఇక్కడ కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తూ ఉంటుంది.
DEVOTIONAL