ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.ఇందులో భాగంగా పార్టీ అంతర్గత విషయాలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.
అదేవిధంగా జాతీయ స్థాయి పదవుల కోసం మరి కొందరు నేతలు ఖర్గేతో మంతనాలు చేయనున్నారని సమాచారం.ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ టికెట్ల కేటాయింపు ఉండేలా చూడాలని కాంగ్రెస్ నేతలు కోరారు.
కాగా సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి బయలుదేరారని సమాచారం.అయితే నిన్న చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే.