తెలంగాణ ప్రజా ప్రతినిధులకోర్టు న్యాయమూర్తి సస్పెండ్ అయ్యారని తెలుస్తోంది.మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పది మంది అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించిన ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.కాగా శ్రీనివాస్ గౌడ్ కేసులో తమపైనా కేసులు నమోదుకు కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారంటూ మండిపడింది.ఈ క్రమంలో సదరు వ్యవస్థలపై కేసుల నమోదుకు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది.
అనంతరం జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.