పవన్ రాజకీయాలపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. ఆయనేం చెప్పారంటే?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు( Manchu Vishnu ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మంచు విష్ణు గత సినిమా జిన్నా( Ginna Movie ) కంటెంట్ బాగానే ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

 Manchu Vishnu Sensational Comments About Pawan Politics Details, Manchu Vishnu,-TeluguStop.com

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు( MAA Elections ) 2024లో జరగనుండగా ఈ ఎన్నికల్లో సైతం తాను పోటీ చేయనని మంచు విష్ణు వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా పవన్ రాజకీయాలపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

పవన్( Pawan Kalyan ) రాజకీయాల గురించి చెప్పాలనే ప్రశ్న మంచు విష్ణుకు ఎదురు కాగా పవన్ పాలిటిక్స్ గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారినా అని విష్ణు అన్నారు.సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అని మంచు విష్ణు కామెంట్లు చేశారు.

ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని పవన్ సినిమాల గురించి అయితే తాను చెప్పగలుగుతానని విష్ణు పేర్కొన్నారు.పవన్ సినిమాలలో ఒక మూవీ ఆడకపోయినా మరో మూవీకి కలెక్షన్లు వస్తాయని విష్ణు చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి( Pawan Politics ) మాత్రం తాను చెప్పలేనని విష్ణు అన్నారు.పాలిటిక్స్ కు సంబంధించి ప్రజలు స్మార్ట్ గా ఉన్నారని విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినిమా వస్తే చూస్తారని రాజకీయాల్లో మాత్రం ఎవరు నచ్చితే వాళ్లకే ఓటేస్తారని విష్ణు తెలిపారు.రాజకీయాల్లో లెజండరీ పర్సన్స్ కూడా ఓడిన సందర్భాలు ఉన్నాయని మంచు విష్ణు వెల్లడించారు.ఆరు నెలలు ఆగితే పాలిటిక్స్ లో పవన్ భవిష్యత్తు గురించి తాను చెప్పగలనని విష్ణు పేర్కొన్నారు.మంచు విష్ణు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube