భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.మద్యం సేవించి వచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడన్న కోపంతో కన్న కొడుకును హత్య చేశాడు ఓ తండ్రి.
ఈ అమానుష ఘటన కొత్తగూడెంలో జరిగింది.తరచూ తాగుతూ డబ్బులు ఇవ్వాలని అడుగుతుండటంతో శంకర్ అనే వ్యక్తిపై తండ్రి రాజయ్య గొడ్డలితో దాడి చేసి చంపేశాడని తెలుస్తోంది.
అనంతరం నిందితుడు కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.