టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Prabhas ) నటించిన ఏ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వస్తున్నా పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్ గురించి నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది.సాహో సినిమా నుంచి ఆదిపురుష్ సినిమా వరకు ఇదే రిపీట్ కాగా సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల విషయంలో సైతం ఇదే జరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభాస్ పై ఇంత పగేంటి అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తాజాగా ప్రాజెక్ట్ కే( Project k ) సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ కాగా ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానులకు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉండనుందని సమాచారం అందుతోంది.
పాన్ వరల్డ్ స్టార్ ఎదుగుతున్నాడనే ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ మాత్రం తన సినిమాలకు సంబంధించి ఎంత నెగిటివిటీ వ్యక్తమవుతున్నా ఆ నెగిటివిటీని పట్టించుకోవడం లేదు.
ప్రభాస్ ను బాలీవుడ్ వాళ్లు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ 75 కోట్ల రూపాయల నుంచి 125 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.ప్రభాస్ పోస్టర్ల విషయంలో కొంతమంది నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రభాస్ కు క్రేజ్, పాపులారిటీ భారీ స్థాయిలో ఉంది.
ప్రభాస్ గత సినిమాలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్( Adipurush ) ఆశించిన స్థాయిలో టాక్ ను సొంతం చేసుకోలేకపోయినా ఈ సినిమాలకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.ఏ హీరో విషయంలో జరగని విధంగా ప్రభాస్ విషయంలో జరుగుతుండటం ఫ్యాన్స్ బాధ పెడుతుండటం గమనార్హం.ప్రభాస్ తన సినిమాలకు సంబంధించి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.