యుక్రెయిన్ – రష్యా( Russia ) యుద్ధం మొదలు అమెరికాకు, రష్యాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలోనే రష్యా ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకొని అమెరికాకు షాక్ ఇచ్చింది.
అక్కడ తయారైన యాపిల్ ఐఫోన్లను ప్రభుత్వ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని నిషేధించినట్లు తెలుస్తోంది.ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడింది.
ఐఫోన్‌లు మాత్రమే కాకుండా ఐప్యాడ్‌ల వంటి ఇతర యాపిల్ ఉత్పత్తులను వినియోగించడం మానేయాలని రష్యా యొక్క ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వేలాది మంది అధికారులకు చెప్పిన్నట్లు తెలుస్తోంది.నిన్న అనగా జూలై 17 నుంచి రష్యా యొక్క వాణిజ్య మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులు ఇకపై ఆఫీసుల్లో ఐఫోన్‌లను ఉపయోగించడానికి అనుమతించబడరని నివేదికలో వెల్లడించడం జరిగింది.
అమెరికా( America ) గూఢచర్య ప్రయత్నాల పెరుగుదలతో రష్యా సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ నేపథ్యంలో యాపిల్ ఉత్పత్తులను నిషేధించినట్లు ప్రభుత్వ ఏజెన్సీకి సంబంధించిన ఓ అధికారి అధికారికంగా తెలిపారు.మంత్రిత్వ శాఖలలోని భద్రతా అధికారులు, ఎఫ్ఎస్బీ ఉద్యోగులు, ఐఫోన్స్ వాడటం సురక్షితం కాదని వాటికి ప్రత్యామ్నాయ మొబైల్ ఫోన్స్ వాడుకోవాలని సూచించారు.గతంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌కు మారాలని ఆ దేశ పౌరులకు సూచించిన సంగతి విదితమే.
దేశానికి సంబంధించిన “క్లిష్టమైన ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్”లో ఉన్న ఏజెన్సీలు, సంస్థలను ఆరోగ్య సంరక్షణ, విజ్ఞాన శాస్త్రం, ఆర్థిక రంగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఇకపోతే అమెరికా తమ సాంకేతికతను వైర్‌ట్యాపింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు రష్యా భద్రతా – గూఢచారి చీఫ్ ఆండ్రీ సోల్డాటోవ్( Andrei Soldatov ) తాజాగా పేర్కోవడం సంచలనంగా మారింది.
ఇలాంటి సమయంలో ఉద్యోగులు ఐఫోన్స్ ఉపయోగించడం వల్ల తమ దేశ రహస్యాలు బయటకు వెళ్లే అవకాశం ఉందని నమ్మిన వారు దానిని అక్కడ పూర్తిగా నిషేదిస్తున్నట్లు వెల్లడించారు.కాగా దీనిపై చాలా కాలంగా ఎఫ్ఎస్బీ ఆందోళన చెందుతోంది.
ఇదే పరిణామం ఇతర దేశాలలో కూడా వస్తే ఇక ఐఫోన్ చరిత్ర ఖతం అయిపోవడం ఖాయం అని నిపుణులు అంటున్నారు.