ముఖ్యంగా చెప్పాలంటే ఏ ఇంట్లో అయినా సరే మహిళలు( Women ) సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ఇంట్లోనీ మహిళలు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం( Bath ) చేసి ఇంటి పనులు మొదలు పెట్టాలి అని కూడా చెబుతూ ఉంటారు.
కానీ ప్రస్తుతం సమాజం భారీగా మారిపోయింది.ఇప్పుడున్న జనరేషన్ మహిళలు తమ పని బిజీ వల్ల ఉదయం స్నానం చేయకుండానే ఇంటి పనులు మొదలు పెడుతున్నారు.
కానీ ఇలా అస్సలు చేయకూడదు.మహిళలు స్నానం చేయకుండా కొన్ని పనులు అసలు చేయకూడదు.ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఏ మహిళ అయినా సరే స్నానం చేయకుండా వంట గది లోకి( Kitchen ) అసలు వెళ్ళకూడదు.వాస్తు శాస్త్రం ప్రకారం మన పూర్వీకుల దగ్గర నుంచి వంట గదిలోనీ పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు.స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై, ఆ ఇంటిలోని వారు అనారోగ్యం బారిన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే స్నానం చేయకుండానే బీరువాను( Locker ) అస్సలు తాకకూడదని కూడా చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే కొందరు స్నానం చేయకుండానే బీరువాలోనే డబ్బులు తీసుకుంటారు.కానీ ఇలా అస్సలు చేయకూడదు.ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి.అంతేకాకుండా స్నానం చేయకుండా తల దువ్వుకోవడం, తులసి చెట్టును తాకడం చేస్తే మహా పాపమని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే స్నానం చేయకుండా ఇంట్లో పనులు మొదలుపెడితే ఇంట్లో అశాంతి చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతూ ఉంటాయని పండితులు చెబుతున్నారు.
కాబట్టి మహిళలు ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసి ఇంటి పని మొదలు పెట్టడం ఎంతో మంచిది.
DEVOTIONAL