టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో సమంత( Samantha ) ఒకరు.మధ్య తరగతి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు తెలుగులో దాదాపుగా అందరు అగ్ర హీరోలకు జోడీగా నటించారు.
నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత పెళ్లి తర్వాత కూడా సంతోషంగానే జీవనం సాగించిన సంగతి తెలిసిందే.
అయితే వేర్వేరు కారణాల వల్ల సమంత తన భర్తతో విడాకులు తీసుకున్నారు.
విడాకులు తీసుకున్న తర్వాత సమంత పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అయినా ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు.అదే సమయంలో సమంత మయోసైటిస్( Myositis ) బారిన పడ్డారు.
మయోసైటిస్ నుంచి సమంత కోలుకున్నారని ఫ్యాన్స్ భావించగా సినిమాలకు సమంత గుడ్ బై చెప్పడంతో సమంత మళ్లీ మయోసైటిస్ తో బాధ పడుతున్నారని తెలుస్తోంది.
సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో ఏడాది తర్వాత సామ్ రీఎంట్రీ ఇచ్చినా మంచి ఫలితాలను సొంతం చేసుకోవడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.మరో మూడు రోజులలో కారవాన్ లైఫ్( Caravan Life ) మొదలుకానుందని సమంత చెప్పుకొచ్చారు.
ఈ ఆరు నెలలు చాలా కష్టమైన రోజులని ఎలాగైనా దీనికి ముగింపు పలకాలని ఆమె కామెంట్లు చేశారు.
అమెరికాలో సమంతకు మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన చికిత్స జరగనుందని బోగట్టా.ఈ వ్యాధికి ఎలాగైనా చెక్ పెట్టాలని ఆమె భావిస్తున్నారని సమాచారం అందుతోంది.సమంత ఈ వ్యాధి నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని ఆరోగ్యంగా జీవనం సాగించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సమంత ప్రస్తుతం ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాలి.