గాలిని నిమిషాల్లోనే శుభ్రం చేసేస్తుంది.. ఈ రోబో ఎయిర్ ప్యూరిఫైయర్ చూశారా?

గాలి వల్ల కూడా సోకే కరోనా వైరస్ బారిన నుంచి తప్పించుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడటం చాలామంది మొదలుపెట్టారు.ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఇంట్లో ఎయిర్ ఫ్యూరిఫైయర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

 Cleans The Air Within Minutes.. Have You Seen This Robot Air Purifier? , Robi,-TeluguStop.com

ఎయిర్ ప్యూరిఫైయర్లు అనేవి గాలిని శుభ్రపరుస్తాయి.గాలిలోని వైరస్, బ్యాక్టీరియాను నిర్మూలించి స్వచ్చమైన గాలిని అందిస్తాయి.

గాలిలోని మలినాలను తొలగించి స్వచ్చమైన గాలిని అందిస్తాయి.ఇంట్లోని గదిలో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేసుకుంటే స్వచ్చమైన గాలిని పీల్చుకోవచ్చు.

Telugu Air Purifier, Dealers, Japan, Latest, Plani, Robi, Sang Il Shin, Ups-Tech

అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ల( Air purifier )లో చాలా రకాలు ఉన్నాయి.తాజాగా కొరియన్ డిజైనర్ సాంగ్ ఇల్ సిన్ కంపెనీ ప్లాని( Sang il Shin ) పేరుతో సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఆ కంపెనీ రోబో ఎయిర్ ప్యూరిఫైయర్‌ను తయారుచేసింది.ఈ రోబో ప్యూరిఫైయర్ అనేది ఇల్లు మొత్తం తిరుగుతూ గాలిలోని తేడాలను గుర్తిస్తుంది.దానికి అనుణంగా అది పనిచేస్తూ ఉంటుంది.ఈ మెషిన్ లో సెన్సార్లను కూడా ఏర్పాటు చేశారు.

ఆ సెన్సార్లు కదలికలను గుర్తించి ఏవైనా అడ్డు తగిలితే పక్కకు జరిపి ముందుకు వెళుతుంది.ధుమ్ము, ధూళి, పొగ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఆగి ఉంటుంది.

Telugu Air Purifier, Dealers, Japan, Latest, Plani, Robi, Sang Il Shin, Ups-Tech

నిమిషాల్లోనే ఈ రోబో ప్యూరిఫైయర్ గాలిని శుభ్రపరుస్తుంది.ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పుడు అందరినీ ఆక్టుకుంటుంది.అయితే ఈ రోబో ప్యూరిఫైయర్ ధర ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు.త్వరలోనే తయారీ కంపెనీ ధరలను ప్రకటించే అవకాశముంది.త్వరలోనే ఈ రోబో ప్యూరిఫైయర్లు మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.వీటికి మార్కెట్ లో బాగా డిమాండ్ ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది.

కరోనా తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం బాగా పెరిగిపోయింది.దీంతో వాటి సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube