చందమామ కథలు సినిమా లో చిన్న పాత్ర లో నటించి నటుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న నాగ శౌర్య ( Naga shourya )అక్కడ నుండి మంచి ఫామ్ లో ఉండి దూసుకు పోతున్నాడు.హీరో గా ఊహలు గుసగుసలాడే( Oohalu Gusagusalade ) సినిమా తో పూర్తి స్థాయి లో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత నటించిన సినిమా ల్లో చాలా సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
అయితే కొన్ని సినిమా లు మాత్రం ఆయన స్థాయిని పెంచుతూ ఉన్నాయి.ఈయన సినిమాల సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది.

అయినా కూడా నాగ శౌర్య సినిమా అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా మారింది.ఒకటి రెండు సినిమా లు డిజాస్టర్స్ గా నిలిచినా ఆ తర్వాత వచ్చే సినిమా లు పర్వాలేదు అన్నట్లుగా తెలుస్తున్నాయి.దాంతో గత దశాబ్ద కాలంగా నాగ శౌర్య కెరీర్ కొనసాగిస్తూనే ఉన్నాడు.వరుసగా ఫ్లాప్స్ పడితే ఇప్పటికే నాగ శౌర్య ను చాలా మంది మర్చి పోయేవారు.
ఆయన యొక్క సినిమా ల ఎంపిక చేసుకునే విధంగా అందరికి నచ్చుతుంది.అంతే కాకుండా ఆయన తన టెక్నీషియన్స్ తో వర్క్ చేయించుకునే విధంగా కూడా అందరికి నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి యంగ్ హీరో నాగ శౌర్య సినిమా ల ఎంపిక విషయం లో జాగ్రత్తగా ఉండటం వల్ల కెరీర్ లో ఫ్లాప్స్ పడ్డా కూడా మంచి ఫలితాన్ని చూస్తున్నాడు.

తాజాగా రంగబలి సినిమా( Rangabali ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రంగబలి సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకున్నా కూడా నాగ శౌర్య కెరీర్ మరికొన్నాళ్లు కొనసాగే విధంగా నిలిచింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రంగబలి సినిమా యొక్క హడావుడి వల్ల నాగ శౌర్య కెరీర్ నాలుగు అయిదు సినిమా లు దక్కించుకునే అవకాశం ఉంది.
అందులో ఒకటి రెండు అయినా పర్వాలేదు అనిపించుకుంటే కెరీర్ మరో మూడు నాలుగు సంవత్సరాలు కొనసాగుతుంది.అలా నాగ శౌర్య కెరీర్ ముందు ముందు మరింత బాగుంటుంది అనే అభిప్రాయంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.







