ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) అదికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల , ప్రతిపక్ష పార్టీ అయిన తమపై విశాఖ పట్నం పర్యటన లో వ్యవహరించిన విధానం పట్ల ఆగ్రహించిన జనసేనా ని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా 2024 ఎన్నికలలో అధికార పార్టీని ఓడిస్తానని శపధం చేశారు .ఆ దిశగా పొత్తులపై ఒక అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా పొత్తులతోనే వెళ్తానని ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందనని స్పష్టంగా మీడియా ముఖంగా ప్రకటించారు.
అయితే రోజులు గడుస్తున్న కొద్ది జనసేన వాయిస్ లో మార్పు కనిపిస్తుంది.ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల టార్గెట్ గా వా రాహి యాత్ర మొదలైన తర్వాత వచ్చిన స్పందన, వివిధ వర్గాలతో జనసేనాని మమేకం అయ్యి చర్చించిన తర్వాత వచ్చిన అభిప్రాయాల ఫలితంగా జనసేన రాజకీయ భవిష్యత్తుపై కొత్త ఆలోచనలతో పవన్ కళ్యాణ్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
మొన్నటి వరకు పొత్తుపై ఒక అడుగు జనసేన( Janasena ) ముందుకు వేస్తే టిడిపి ఆచితూచి స్పందించేది.అయితే ఇప్పుడు సీన్ రివర్స్అయ్యిందని పొత్తుల విషయం తేల్చేసుకుంటే నియోజకవర్గం వారి సమీక్ష చేసుకొని బలపడాలని తెలుగుదేశం చూస్తుంటే, వారాహి యాత్ర( Varahi Yatra ) పూర్తయిన తర్వాత ఉన్న పరిస్థితులు బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జనసేనని నిర్ణయించుకున్నట్లుగా ఆ పార్టీ విడుదలచేసిన నోట్ బట్టి అర్థమవుతుంది.తమ పార్టీ వేగంగా ప్రజలకు దగ్గరవుతుందని, వారాహి యాత్రను ఉపయోగించుకొని పూర్తిస్థాయిలో ప్రజాభిమానాన్ని గెలుచుకున్న తర్వాత తమ బలాన్ని చూపించి అప్పుడు సీట్లను అడిగితే కచ్చితం గా ఇవ్వాల్సిన పరిస్థితిలో తెలుగుదేశం ఉంటుందన్న ఆలోచనతోనే జనసేన ని పొత్తు విషయాల్ని ఆఖరిలో చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తుంది.
ఉభయ గోదావరి జిల్లాలలో యాత్రలు పూర్తయిన తర్వాత ఉత్తరాంధ్ర( Uttarandhra ) కేంద్రంగా మరికొన్ని యాత్రలు చేయాలని, తన సామాజిక వర్గం బలంగా ఉన్న ఏరియాల తో పాటు జనసేన సానుభూతిపరులు ప్రజారాజ్యం సమయంలో పార్టీకి మద్దతు ఇచ్చిన వర్గాలను గుర్తించి ఆయా నియోజకవర్గాలలో జనసేన బలపడే విధంగా వ్యవహరచన చేసుకోవాలని ఒకవేళ పొత్తు విఫలమైనట్లయితే సొంతంగా పోటీ చేసినా కూడా ఆయా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు జయకేతనం ఎగురవేయాలనే భారీ వ్యూహంతోనే జనసేన ని ముందుకు వెళుతున్నారని తెలుస్తుంది మరి జనసేనని నిర్ణయం పై తెలుగుదేశం స్పందన ఏమిటో వేచి చూడాలి
.