పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్( BRO MOVIE )’ ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో ఆయనతో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ముఖ్య పాత్ర ని పోషించాడు.
ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలై ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.మొదట్లో ఈ చిత్రం పై అభిమానుల్లో పెద్దగా అంచనాలు ఉండేవి కాదు, మార్కెట్ లో కూడా పెద్దగా క్రేజ్ ఉండేది కాదు, కానీ ఎప్పుడైతే టీజర్ విడుదలైందో అప్పటికే నుండి ఈ చిత్రం పై అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ లో ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇవన్నీ మామూలే, రీమేక్ సినిమాలు చేస్తున్నాడని మొదట్లో నిరాశతో ఉండడం,సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయం లో నరనరాల్లోకి హైప్ ఎక్కించుకోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
ఈ సినిమాకి కూడా సరిగ్గా అదే జరిగింది.ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.దానికి సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది, మొదటి పాట గా ‘మై డియర్ మార్కండేయ‘ అనే పాటని విడుదల చేయబోతున్నారటరేపు ఈ పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు.
ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్( Pawan kalyan ) కాంబినేషన్ లో ఉంటుందట.థమన్ అందించిన పాటలన్నీ ఈ చిత్రానికి అద్భుతంగా వచ్చాయని, అందులో ఈ పాట కూడా ఉందని చెప్తున్నారు.
ఈ ఒక్క పాట క్లిక్ అయితే చాలు, ఈ చిత్రం పై ఆడియన్స్ లో కూడా అంచనాలు అమాంతం పెరిగిపోతాయి.ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటించాడు.
ఆయన పాత్ర చాల స్టైలిష్ గా, వింటేజ్ ఎనర్జీ తో ఉంటుందని టీజర్ ని చూస్తేనే అర్థం అవుతుంది.
సముద్ర ని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటించారు.రీసెంట్ గానే జెర్మనీ లో సాయి ధరమ్ తేజ్ పై ఒక డ్యూయెట్ సాంగ్ ని చిత్రీకరించారు.
దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది.ఇక పవన్ కళ్యాణ్ డబ్బింగ్ ఒక్కటే బ్యాలన్స్ ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ భారీ రేట్స్ కి అమ్ముడుపోయింది.ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 100 కోట్ల రూపాయిలు బిజినెస్ జరుగుతుందట.
వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్క ప్రకారం చూస్తే , 130 కోట్ల రూపాయిల వరకు జరిగిందని అంటున్నారు.