మునగ పంట సాగు చేసే విధానం.. అధిక దిగుబడి కోసం మెలుకువలు..!

మునగలో( Drumstick ) ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండడంతో మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ పలుకుతుంది.కాబట్టి రైతులు మునగను సాగు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

 Cultivation Method Of Drumstick Crop Tips For High Yield , High Yield, Cattle-TeluguStop.com

కొంతమంది రైతులు ఎలా సాగు చేయాలో తెలియక సరైన అవగాహన లోపం కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.మునగ పంటపై అవగాహన ఉంటే తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు పొందవచ్చు.

మునగ సాగుకు గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.కానీ మునగ మంచు, చలిని తట్టుకోలేదు.

పగటిపూట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే పూత రాలిపోయే అవకాశం ఉంది.కాబట్టి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పంటను సాగు చేయాల్సి ఉంటుంది.

ఒక ఎకరాకు 250 గ్రాముల విత్తనాలు( seeds ) అవసరం.అంటే ఒక ఎకరాకు 640 మొక్కలు నాటుకోవాలి.30 నుంచి 45 రోజుల వయసు ఉండే మొక్కలు పొలంలో నాటుకోవాలి.

Telugu Agriculture, Cattle Manure, Drumstick Crop, Yield, Latest Telugu, Wind-La

మునగను జూన్ – ఆగస్టు నెలల మధ్యలో నాటుకుంటే ఫిబ్రవరి, మార్చి నెలలలో కోతకు వస్తుంది.కాబట్టి వేసవికాలంలో పంట అవశేషాలను పూర్తిగా తొలగించి రెండు లేదా మూడుసార్లు లోతు దుక్కులు దున్నుకోవాలి.ఆ తర్వాత ఒక ఎకరం పొలంలో పది టన్నుల పశువుల ఎరువు ( Cattle manure )వేసి కలియ దున్నుకోవాలి.

మొక్కల మధ్య దూరం 2 మీటర్లు, వరుసల మధ్య దూరం రెండు మీటర్లు ఉండేటట్లు నాటుకుంటే అంతరకృషి చేయడానికి వీలుంటుంది.పైగా సూర్యరశ్మి, గాలి( Sunlight, wind ) బాగా తగిలి మునగ మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

మునగ మొక్కలు నాటిన వెంటనే నీటి తడులు అందించాలి.నీ నేల స్వభావాన్ని బట్టి పది రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.

Telugu Agriculture, Cattle Manure, Drumstick Crop, Yield, Latest Telugu, Wind-La

పంట పూతకు వచ్చే సమయం నుండి ఆరు రోజులకు ఒకసారి నీటి తరులు అందిస్తే మునగకాయలు ఆరోగ్యకరంగా పొడవుగా పెరుగుతాయి.మొక్క యొక్క ఆకులు మూడు అడుగులు పెరిగిన తర్వాత కొన చివర్ల కొమ్మల కత్తిరింపులు జరపడం వల్ల దిగుబడి పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube