ప్రపంచ చరిత్రలోనే అది అత్యంత దారుణమైన శిక్ష.. ఏనుగుకి ఉరి ఏమిటి?

ప్రపంచ చరిత్ర పుటల్లో ఎన్నో దారుణమైన సంఘటనలు దాగి ఉంటాయి.అయితే అందులో ఏ కొన్నో వెలుగులోకి వస్తాయి.

 It Is The Worst Punishment In The History Of The World.. What Is The Hanging Of-TeluguStop.com

అలాంటి అమానుష చర్యల్లో ఏనుగు ఉరిశిక్ష ఒకటి.కొన్ని దేశాల్లో క్రూరమైన రాజుల పాలన సాగిందనే విషయం మనం మన చరిత్రకు సంబందించిన పాఠ్య పుస్తకాల్లో చదివి ఉంటాం.

ఇక వారి శిక్షలు వెన్నులో వణుకుపుట్టించేవిగా ఉంటాయి.అయితే అంతకన్నా అత్యంత క్రూరమైన యజమాని గురించి, అతను విధించిన హేయమైన శిక్ష గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోక తప్పదు.

ఓ ఏనుగును క్రేన్‌కు బిగించి, అందరి ముందు దానికి ఉరి శిక్ష విధించాడంటే.అతను ఎంత క్రూరమైనవాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

అత్యంత సాధు జంతువుగా పేరొందిన ఏనుగుకు శిక్ష విధించాడంటే అతని నిర్దయ ఏపాటితో అ‍ర్థమవుతుంది.

Telugu America, Elephant, Latest, Mary-Telugu NRI

అది 1816, సెప్టెంబరు 13. అమెరికా(America )లో అత్యంత హేయంగా ఒక ఏనుగును క్రేన్‌కు వేలాడదీసి మరణశిక్ష విధించడం ఆ రోజు జరిగింది.సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే రోజు అది.ఆ ఏనుగు పేరు మేరీ( Mary )అది తన మావటివాడిని కాలితో తొక్కి చంపేసిందనే నెపంతో దానికి అంత దారుణమైన శిక్ష విధించాడు సదరు వ్యక్తి.అసలు విషయంలోకి వెళితే… ఆ ఏనుగు ఆకలితో అల్లాడిపోతూ అదుపు తప్పడంతో దానిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన మావటివాడు దాని చెవిపై గట్టిగా కొట్టాడు.

దాంతో చిర్రెత్తిన ఆ ఏనుగు కోపంతో.ఒక్కసారిగా తన పాదంతో ఆ మావటివాడిని తొక్కి చంపేసింది.

Telugu America, Elephant, Latest, Mary-Telugu NRI

ఈ విషయంలో ఆ ఏనుగు తప్పు లేకపోయినప్పటికీ అమానుషంగా దానిని చంపేశారు.అది ఒక సర్కస్‌లో పనిచేస్తుండేది.మావటివాడిని తొక్కి చంపేయడంతో ఆ ఏనుగుపై స్థానికులకు ఆగ్రహం కలిగింది.జనాగ్రహాన్ని చూసిన సర్కస్‌ యజమాని ఈ నిర్ణయం తీసుకున్నాడు.ఆ ఏనుగుకు మరణశిక్ష ( Elephant )విధించాలని దానిని చంపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాడు.ఇందుకోసం 100 టన్నుల బరువు ఎత్తగల ఒక ప్రత్యేకమైన క్రేన్‌ తెప్పించి ఏనుగు మెడను తాడుతో కట్టేందుకు ఒక ప్రత్యేకమైన తాడును కూడా తెప్పించాడు.

క్రేన్‌ సాయంతో ఏనుగు మెడకు ఉరితాడు బిగించి, దానికి బహిరంగంగా జనసమూహం మధ్యలో మరణశిక్ష విధించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube