సోషల్ మీడియా పాపులర్ అయిన తర్వాత ఎంతోమంది ప్రతిభావంతులు తమ ప్రతిభను వీడియో రూపంలో వెలుగులోకి తేస్తున్నారు.చదువుతో సంబంధం లేకుండా వారిలోని ప్రతిభను చూపించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
కొందరు వంటకాలతో, కొందరు డ్యాన్స్లతో, కొందరు ఆర్ట్ లేదా కళలతో ప్రతిభ ను చూపిస్తే మరి కొంతమంది ఏమో చదువు పరిజ్ఞానం లేకపోయినా అద్భుతమైన ఇంజనీరింగ్ నమూనాలను( Engineering models ) చూపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.ఇలాంటి ఆశ్చర్యకరమైన ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది.
ఈ వీడియో చూసిన వారంతా ఇది ట్రాక్టరా లేదంటే బైకా అని ఆశ్చర్యపోతున్నారు.ట్రాక్టర్ ను బైక్ లాగా మార్చారా లేదంటే బైక్ ను ట్రాక్టర్ల లా మారిందా అనే విషయం చెప్పడం కాస్త కష్టమే.
అయితే దీనిని బైక్ ట్రాక్టర్ గా చెప్పుకోవచ్చు.దీనిని తయారుచేసిన వ్యక్తి ఇంజనీర్ కు ఏ మాత్రం తీసిపోడు.నిజంగా కొంతమంది చేసే పనులు చూస్తుంటే ఒకవేళ వారు చదువుకొని ఉంటే ఏ స్థానంలో ఉండేవారు కదా అనుకుంటాం.ఇప్పుడు ఈ బైక్ ట్రాక్టర్ ను ఎవరు తయారు చేశారు.
ఎలా తయారు చేశారు.ఎటువంటి పరికరాలు ఉపయోగించారు అనే వివరాలు చూద్దాం.
మనం చూస్తున్న ఈ బైక్ ట్రాక్టర్ ను మధ్యప్రదేశ్( Madhya Pradesh ) కు చెందిన సురేష్ ( Suresh )అనే ఒక వ్యక్తి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు.ఇక ఈ వాహనం తయారు చేయడానికి బానేటెడ్ ఇంజిన్, స్టీరింగ్ స్థానంలో బుల్లెట్ బైక్ బాడీ వర్క్ తో కూడిన మినీ ట్రాక్టర్ ను చూపుతుంది.ఇక ట్రాక్టర్ లో దిగువ నాలుగు చక్రాలు పైకప్పుతో సాధారణ టాక్టర్ మాదిరిగానే ఉంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బుల్లెట్ బైక్ ట్రాక్టర్ చూసిన వారంతా కామెంట్ చేస్తున్నారు.