సిసింద్రీ( Sisindri ) సినిమాతో చిన్న వయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అఖిల్ ( Akhil )గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మనం సినిమాలో క్లైమాక్స్లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ తర్వాత అఖిల్ అనే సినిమాలో హీరోగా నటించాడు.
కానీ ఎందుకో అంతగా టాక్ తెచ్చుకోలేదు ఈ సినిమా.తర్వాత డైరెక్టర్ శీను( Director Shreenu ) విక్రమ్ కుమార్( Vikram Kumar ) దర్శకత్వంలో హలో సినిమాలో చేశాడు.
ఇక ఈ సినిమా ఒకింత మెప్పించింది.ఇక ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో చేశాడు.
ఈ రెండు సినిమాలు కూడా పూర్తిగా డిజాస్టర్ అయ్యాయి.ఇక ఆ సమయంలోనే అఖిల్ కి హీరోగా కలిసి రాదు అని చాలామంది అనుకున్నారు.
అయినా కూడా వెనుకడుగు వేయకుండా తనవంతు ప్రయత్నం చేయటానికి ముందుకు వచ్చాడు.అలా సురేందర్ రెడ్డి( Surender Reddy ) దర్శకత్వంలో ఏజెంట్ సినిమాకు బాగా హైప్ క్రియేట్ చేశాడు.

దీంతో చాలామంది ప్రేక్షకులు ఈసారైనా సరైన హిట్టు అందుకుంటాడో లేదో అని అనుమానాలు పడ్డారు.అన్నట్టుగానే ఈ సినిమా పూర్తి డిజాస్టర్ అయ్యింది.ఈ సినిమా చూసిన జనాలంతా ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు.ముఖ్యంగా అఖిల్ ను ఇక నీకు సినిమాలు సెట్ అవ్వవు పెట్ట సర్దుకోవడమే అంటూ రకరకాలుగా కామెంట్లు పెట్టారు.
అక్కినేని ఫ్యామిలీ( Akkineni family ) కూడా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సైలెంట్ అయ్యారు.ఇక ఈ సినిమా ప్లాఫ్ అవ్వడంతో అఖిల్ పని అయిపోయింది అని అందరూ అంటున్నారు.
ఒకవేళ అఖిల్ మరో ప్రయత్నం చేసి ఏదైనా సినిమాతో వచ్చినా కూడా ఈసారి జనాలు చూడటానికి కూడా ఆసక్తి చూపించరు అని అర్థమవుతుంది.స్టార్ కిడ్ అయినప్పటికీ కూడా అఖిల్ లో టాలెంట్ లేదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

అయితే అఖిల్ మొదటి నుంచి సినిమాల ఎంపిక విషయంలో తొందరపడటం వల్ల ఇలా అవుతుందని తన సన్నిహితులు చెప్పుకుంటూనే వస్తున్నారు.కానీ అఖిల్ మాత్రం వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోవటం వల్ల ఇటువంటి టాక్ తెచ్చుకుంటున్నాడు అని తెలిసింది.అయితే ఇంత కాలానికి అఖిల్ కు ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.తన తాత అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) గారు సినిమాల పరంగా జనాల మనసు దోచేయాలనే సలహాలు ఇచ్చేవారట.
దీంతో అభిమానుల మనసుదోచాలంటే ముఖ్యంగా కథలో బలం ఉండాలని.అభిమానుల స్థానంలో కూర్చొని ఆలోచించాలని.అప్పుడే మనం మంచి కధలను చూస్ చేసుకోగలం అన్న కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్తూ డిఫరెంట్ కంటెంట్ ను చూస్ చేసుకోవాలనుకుంటున్నాడట అఖిల్.ఇక మేకర్స్ లను ఇబ్బంది పెట్టకుండా తన సినిమాను తానే నిర్మించుకునేందుకు నిర్ణయించుకుందట.
ప్రస్తుతం ఈయన తీసుకున్న నిర్ణయం వైరల్ అవ్వటంతో ఆయన అభిమానులు ఒకింత తృప్తి పడుతున్నారు.ఇక తాత కాన్సెప్ట్ ఫాలో అయ్యే అఖిల్ కు ఇప్పుడైనా కలిసి వస్తుందో లేదో చూడాలి.







