సనాతన హిందూ ధర్మం( Hindu Dharma ) లో దైవారాధనకు చాలా విశిష్ట స్థానం ఉంది.ఒక్కొక్క దేవుడికి వారంలో రోజులు అంకితం చేయబడ్డాయి.
అంతేకాకుండా ఒక్కొక్క గ్రహానికి సంబంధించినదిగా భావించి పూజిస్తారు.అయితే శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి( Sri Venkateswara Swamy ) అంకితం చేయబడింది.
అంతేకాకుండా శని దోష నివారణకు శనీశ్వరుడికి అనుగ్రహం కోసం శనివారం ప్రత్యేక నివారణ చర్యలు పాటిస్తారు.అయితే భక్తులు కోరుకున్న కోరికలు అన్నీ తీరి శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుండి రక్షణ కలుగుతుంది.
అయితే శని ప్రభావం నుండి బయటపడడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం శనివారం రోజున ఈ విధంగా పూజ చేయాలి.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జాతకంలో దోషం ఉంటే జీవితంలో ఎన్నో అష్ట కష్టాలు పడుతూ ఉంటారు.అలాంటివారు శ్రీనివాసుని కృపతో శని దోష నివారణకు 7 శనివారాలు పూజ చేయాలి.ఇక శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి.పూజకు ముందు పూజగదిని శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత అభ్యంగ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.ఇక పూజ గదిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చేయాలి.
ఇక బియ్యం పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చపాతి పిండిలా కలపాలి .ఆ పిండితో ప్రమిదను చేసుకోవాలి.ఇక ప్రమిదలో ఏడు వత్తులను వేసి ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించాలి.
శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది.అందుకే పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభించి, సుఖసంపదలు కలుగుతాయి.ఇక తులసి కోటముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం( Goddess Lakshmi ) తో పాటు ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.అదేవిధంగా శని దోషంతో బాధ పడుతున్న వారు శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని.
ఆ తర్వాత ఆవు నేతితో దీపం వెలిగించాలి.ఇలా చేసిన వారికి స్వామివారి అనుగ్రహంతో బాధలు తొలగి సుఖసంతోషాలు ఉంటాయి.
TELUGU BHAKTHI