అన్నం( Rice ) మన రోజువారి ఆహారంలో ముఖ్యమైన భాగమని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఇది ఆసియాలోని అనేక ప్రాంతాల ప్రజలు ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు.
చాలా మంది రోజుకు ఒక్కసారైనా అన్నం తీసుకుంటూ ఉంటారు.రోజు అన్నం తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరగదని చాలామందికి తెలియదు.
అన్నం కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ అధికంగా ఉండే పోషకాలు లేని ఆహారం.శుద్ధి చేసిన తెల్ల బియ్యాన్ని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి( Sugar Levels ) పెరగడంతో పాటు వేగంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.
ఇప్పుడు మనం తిన్న అన్నం తినకూడదా అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది.డైట్ నుంచి రైస్ స్కిప్ చేయడానికి మనం ప్రారంభంలో ఒక నెలపాటు అన్నం తినకపోతే అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు ఒక నెల పాటు అన్నం తినడం మానేస్తే కేలరీల తీసుకోవడం తగ్గడం వల్ల మీ శరీరం బరువు తగ్గవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.బియ్యం లో కార్బోహైడ్రేట్ల పరిమాణం( Carbohydrates ) ఎక్కువగా ఉంటుంది.
దీని కారణంగా రక్తంలో చక్కని స్థాయి పెరుగుతుంది.ఒక నెలరోజుల పాటు అన్నం పూర్తిగా వదులుకోవడం వల్ల కొంత వరకు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
అయితే బియ్యం వినియోగాన్ని ఆపడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం బియ్యం తీసుకోవడం రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి.నెల రోజుల పాటు అన్నం తినకపోతే మీ రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుంది.మీ అధిక బరువు కూడా తగ్గవచ్చు.పూర్తిగా అన్నం తినకపోతే మనిషి బలహీనపడే అవకాశం కూడా ఉంది.అలాగే అన్నం తినకుండా ఉండడం వల్ల శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం కూడా ఏర్పడుతుంది.
కాబట్టి కాస్త తెలివిగా డైట్ లో కాస్త అన్నం ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.