ఆదిపురుష్ మూవీని త్రీడీలో చూస్తేనే బెటరా.. నెగిటివ్ కామెంట్లు చేసేది వాళ్లేనంటూ?

ఆదిపురుష్( Adipurush ) సినిమాను త్రీడీలో చూసిన ప్రేక్షకులెవరూ నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు.అదే సమయంలో త్రీడీ షాట్స్ అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.2డీలో ఈ సినిమాను చూసిన వాళ్లు మాత్రం మరీ అంత గొప్పగా లేదని చెబుతున్నారు.అయితే ఆప్షన్ ఉండి ఆదిపురుష్ చూడాలని భావించే వాళ్లకు మాత్రం త్రీడీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

 Shocking Facts About Adipurush Movie Details Here Goes Viral , Adipurush , Pra-TeluguStop.com

ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలలో త్రీడీలో విడుదలైన సినిమాలలో త్రీడీ షాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి.ఆదిపురుష్ మూవీలో మాత్రం త్రీడీ షాట్స్ ప్రేక్షకులు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయి.

ఆదిపురుష్ పై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదని చెప్పవచ్చు.పిల్లలతో సినిమా చూసేవాళ్లకు త్రీడీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Prabhas, Ramayana, Saif Ali Khan-Movie

అయితే ఈ మూవీలో సినిమాటిక్ లిబర్టీస్ చాలానే ఉన్నాయని వాటిని తట్టుకోగలం అంటే మాత్రమే ఈ సినిమా చూడాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మోడ్రన్ రామాయణం( Ramayana ) చూడాలని భావించేవాళ్లకు మాత్రం ఆదిపురుష్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.భవిష్యత్తు తరాలకు నచ్చాలనే ఆలోచనతో ఓం రౌత్ మరీ కథలో మార్పులు చేశారని కొంతమంది చెబుతున్నారు.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Prabhas, Ramayana, Saif Ali Khan-Movie

ఆదిపురుష్ పై గతంలో ట్రోల్స్ వచ్చాయి.రాబోయే రోజుల్లో కూడా ట్రోల్స్ వస్తాయి.అయితే ప్రభాస్( Prabhs ) అభిమానులు మాత్రం ఆదిపురుష్ నుంచి ఏం కోరుకుంటారో ఈ సినిమా అలానే ఉంది.ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులు తక్కువ కావడంతో కొంతమందికి డబ్బింగ్ మూవీ చూసిన భావన కలుగుతుంది.350 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుండగా సోమవారం కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితం గురించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube