హీరోయిజం కాస్త జీరోయిజం అవుతుంది... పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ వేసిన వర్మ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వారాహి యాత్ర( Varahi Yatra ) లో పాల్గొంటూ రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈయన వారాహి యాత్రలో భాగంగా ఈయన తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటన చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

 Heroism Becomes A Bit Of Zeroism, Pawan Kalyan, Varahi Yatra, Ramgopal Varma, Na-TeluguStop.com

ఈ క్రమంలోనే జూన్ 15వ తేదీ పవన్ కళ్యాణ్ తన యాత్రలో భాగంగా చేబ్రోలు సభలు పాల్గొన్న విషయం మనకు తెలిసిందే ఈ సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ వేదికపై పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా తనకు ఓట్లు వేసి గెలిపించాలని, తనని అసెంబ్లీకి పంపించాలని ఒక్కసారిగా ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి అంటూ అభిమానులను ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ramgopal Varma ) స్పందించి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలోనే వర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకొని ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుంటున్నారు.ఆయన హీరోయిజం కాస్త జీరోయిజం అవుతోంది అంటూ వర్మ చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.అయితే వర్మ ఇటీవల నారా లోకేష్( Nara Lokesh ) పై కూడా విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే.లోకేష్ రాయలసీమలో పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నేలను నమస్కరిస్తూ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆస్కార్ అవార్డు(Oscar Award) లోకేష్ కు ఇవ్వాలి అంటూ కామెంట్ చేశారు.

అయితే వర్మ మాత్రం పవన్ లోకేష్ ను టార్గెట్ చేసే ఇలా కామెంట్ చేస్తున్నారంటూ వీరి అభిమానులు వర్మపై మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube